మాస్ మహారాజ రవితేజ పక్కా మాస్ మసాలాతో సినిమా చేసి ప్రేక్షకులను కట్టి పడేసేవాడు.రవితేజ నటించిన చిత్రాలన్ని దాదాపు మంచి వసూళ్లు రాబట్టేవి.
ఏదో మరీ చెత్తగా ఉంటే తప్పితే నిర్మాతలకు పెద్దగా నష్టం ఏం వచ్చేది కాదు.కానీ ఇదంతా ఒకప్పటి మాట.ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.గతకొంత కాలంగా రవితేజ సినిమాలకు ఆదరణ కరువయింది.
మాస్ మసాలాకు బ్రాండ్ అంబాసిడర్‌గా పేరు తెచ్చుకున్న రవితేజ ఇంకా ఇలాంటి చిత్రాలను చేయడంతో ప్రేక్షకుల నుండి ఆదరణ కరువయ్యింది.దాంతో మార్కెట్‌లో రవితేజ సినిమాలకు క్రేజ్ తగ్గిపోయింది.

గతంలో సక్సెస్ జోరు మీదున్నప్పుడు పారితోషికం విషయంలో చాలా స్టిక్ట్‌గా ఉండేవాడట.ఈయన ఏదైతే చెప్పాడో నిర్మాతలు అంత ఇవ్వాల్సిందే లేదంటే ఇక ఆ ప్రాజెక్ట్‌నే క్యాన్సిల్ చేసేవాడట.కానీ ప్రస్తుతం అలాకాదు.రవితేజ తాజా చిత్రం వీ ఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతోంది.ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ వారు నిర్మిస్తున్నారు.కాగా ఈ చిత్రానికి మొదటగా రవితేజ 10కోట్లు డిమాండ్ చేశాడట.
కానీ అంతమొత్తంలో ఇప్పట్లో రవితేజపై పెట్టడం సాహసం అని నిర్మాతలు ఒక అడుగు వెనక్కి వేయగా రవితేజ అందుకు దిగి వచ్చాడట.

పదికోట్లు ఇవ్వడానికి నిర్మాతలు సంకోచిస్తే ప్రస్తుతం అయిదు కోట్లకే డీల్ మాట్లాడుకున్నాడు.డిమాండ్ చేసిన మొత్తంలో సగం వరకు తగ్గడం విశేషం.రవితేజకు మార్కెట్‌లో పరిస్థితి అంత దారుణంగా ఉంది మరి.అందుకు కారణం వరుస అపజయాలే.అయితే సినిమాలు ఇంకా చేయడానికి తాను ఎంతకైనా సిద్దమంటున్నాడు కాబట్టి ఈ లెవల్ లో పారితోషికాన్ని భారీగా తగ్గించారు.
మాస్‌మహారాజ ఈ నిర్ణయానికి నిర్మాతలు సైతం షాకవుతున్నారు.







