టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా సక్సెస్ అందుకున్న వారిలో దర్శకుడు నాగ్ అశ్విన్(Nag Aswini) ఒకరు.ఇక ఈయన చివరిగా ప్రభాస్ (Prabhas)హీరోగా నటించిన కల్కి (Kalki)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు పూర్తీ అవుతున్నాయి.ఇదిలా ఉండగా ఇటీవల ప్రభాస్ నటించిన సలార్, కల్కి సినిమాలో ప్రభాస్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనే విమర్శలు కూడా వచ్చాయి.
ఈ విషయం గురించి ప్రభాస్ అభిమానులు కూడా తెగ ఫీలయ్యారు.

పాన్ ఇండియా స్టార్ హీరో అయినటువంటి ప్రభాస్ కి తన సినిమాలో సరైన స్క్రీన్ స్పేస్ లేకపోవడంతో ప్రభాస్ కి పూర్తిస్థాయిలో అన్యాయం జరిగింది అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదే విషయం గురించి కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కు కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ క్రమంలోనే ఈయన అభిమానులకు మాట కూడా ఇచ్చారు.
కల్కి 2 లో ప్రభాస్ పాత్రకు అన్యాయం జరగదని, ప్రభాస్ కు స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుందని హామీ ఇచ్చారు.మొదటి పార్ట్ లో మహాభారతంలోని కీ ఎలిమెంట్స్ ను సెట్ చేసి, క్యారెక్టర్స్ ను ఎస్టాబ్లిష్ చేసే వరకే సమయం సరిపోయింది అన్నారు.
మొదటి పార్ట్ లో అందుకే అశ్వద్ధామ పాత్రను ఎక్కువగా చూపించినట్టు తెలిపారు.

ఇక పార్ట్ 2 లో కర్ణుడు వర్సెస్ అర్జునుడు అనే విధంగా సినిమా మొత్తం కొనసాగుతుంది.ఈ క్రమంలోనే పార్ట్ 2 లో ప్రభాస్ ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తారని ఈయన తెలిపారు.ప్రభాస్ అభిమానులకు హై నిచ్చే సీన్లు కూడా ఉంటాయని నాగ అశ్విన్ స్వయంగా తెలిపారు.
ఇలా నాగ్ అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.