సందీప్ రెడ్డి వంగా డైరక్షన్ లో మిస్టర్ కూల్.. అదిరిపోయిందగా!

ఇండియన్ క్రికెట్‌లో లెజెండ్‌గా, సూపర్ కూల్ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ఎంఎస్ ధోని( MS Dhoni ) మరోసారి వార్తల్లో నిలిచాడు.అతని స్ట్రాటజీలు, ఆటతీరు మాత్రమే కాదు, స్క్రీన్‌పై కూడా ఆకట్టుకునే విధంగా తన టాలెంట్‌ను చూపిస్తున్నాడు.

 Ms Dhoni Turns Into Animal For Sandeep Reddy Vanga In New Ad Details, Ms Dhoni,-TeluguStop.com

ఇక మరోవైపు సందీప్ రెడ్డి వంగా,( Sandeep Reddy Vanga ) ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రతిభావంతుడు.అతని తాజా చిత్రం ‘యానిమల్’( Animal ) ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఈ ఇద్దరి కలయికలో వచ్చిన తాజా యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ధోని త్వరలో ఐపీఎల్ 2025( IPL 2025 ) (18వ సీజన్) కోసం మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.అయితే, క్రికెట్‌కు ముందే, ధోని తనలోని ‘యానిమల్’ను బయటికి తెచ్చేశాడు.అవును మీరు చదివింది నిజమే! ధోని, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలిసి EMotorad అనే ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ కోసం ఓ ఫన్నీ యాడ్ షూట్ చేశారు.

ఈ యాడ్‌లో ధోని బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ చిత్రంలోని ఓ పవర్‌ఫుల్ సీన్‌ను రీక్రియేట్ చేశాడు.రణ్‌బీర్ సినిమాలో తన కారు నుంచి స్టైలిష్‌గా దిగిపోతూ, తన గ్యాంగ్‌తో కలిసి రోడ్డు దాటే సన్నివేశం గుర్తుందా? అదే తరహాలో ఈ యాడ్‌లో ధోని ఎలక్ట్రిక్ సైకిల్‌పై స్టైలిష్‌గా రోడ్డు దాటుతుంటాడు.ఈ ప్రకటనలో సందీప్ రెడ్డి వంగా, ధోని మధ్య ఫన్నీ సంభాషణలు కూడా ఉన్నాయి.వీటి వలన యాడ్ మరింత ఆకర్షణీయంగా మారింది.

ఈ యాడ్‌తో ధోని మరోసారి తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు.అయితే ధోని అభిమానుల కోసం పెద్ద వార్త ఏమిటంటే, ఆయన త్వరలోనే ఐపీఎల్ 2025లో మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.మార్చి 23న, చెన్నైలో ముంబై ఇండియన్స్‌తో మొదటి మ్యాచ్ జరగనుంది.ఇది కచ్చితంగా ఫ్యాన్స్‌కు పండగలా మారనుంది.ఈ యాడ్‌తో ధోని నటనా ప్రతిభను మరోసారి చూపించాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే, ధోని సినిమాల వైపు కూడా అడుగులు వేస్తాడా? అనే చర్చలు మొదలయ్యాయి.ధోని క్రికెట్‌తోపాటు ఇంకా ఎన్ని కొత్త ప్రయోగాలు చేయబోతాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube