ఇంత స్లిమ్‌గా, యంగ్‌గా ఉన్న ఈ చైనీస్ మహిళ ఓ అమ్మమ్మ అట.. వయసు తెలిసి నెటిజన్లు షాక్!

మీరు ఇంకా 30 ఏళ్లలో సింగిల్‌గా ఉన్నారా అయితే మీకొక షాకింగ్ న్యూస్, మీ వయసున్న ఒక మహిళ ఆల్రెడీ అమ్మమ్మ కూడా అయిపోయింది.అవును, చైనాలోని అన్హుయి ప్రావిన్స్‌లోని సుజౌకు (Suzhou, Anhui Province)చెందిన 39 ఏళ్ల మహిళ తన యవ్వన రూపంతో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

 This Chinese Woman, Who Is So Slim And Young, Is A Grandmother.. Netizens Are Sh-TeluguStop.com

సోషల్ మీడియాలో ‘1985లో పుట్టిన అమ్మమ్మ’ అనే పేరుతో పాపులర్ అయిన ఈ మహిళ రీసెంట్‌గా మొదటిసారి అమ్మమ్మ అయ్యారు.కొత్త రోల్ లోకి ఎంట్రీ ఇచ్చినా, ఆమె చాలామంది ఊహించిన దానికంటే చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు.

ఒక వైరల్ వీడియోలో, ఆమె తన మనవడికి బాటిల్‌తో పాలు పడుతుండగా, బేబీ పేరెంట్ దగ్గరలో రెస్ట్ తీసుకుంటూ కనిపించారు.పొడవాటి పోనీటెయిల్, లైట్ మేకప్, క్యూట్ స్మైల్‌తో (With a ponytail, light makeup, and a cute smile)ఆమె ఒక స్టైలిష్ యంగ్ మమ్‌లా ఉన్నారు కానీ బామ్మలా అయితే అస్సలే లేరు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో క్షణాల్లో వైరల్ అయిపోయింది, నెటిజన్లు షాక్ తినేలా చేసింది.ఆమె అమ్మమ్మ అయ్యేంత పెద్ద వయసులో ఉన్నారని చాలామంది నమ్మలేకపోయారు.

క్యూరియాసిటీతో ఉన్న వ్యూయర్స్ ఆమె వయసును గూగుల్ చేసి చూస్తే, ఆమె 1985లో పుట్టారని, అంటే ఆమెకు జస్ట్ 39 ఏళ్లే అని తెలిసి స్టన్ అయిపోయారు.ఈ యంగ్ గ్రాండ్ మదర్ తన ఫ్యామిలీ లైఫ్ గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా షేర్ చేస్తున్నారు.

ఆమె తరచుగా తన మనవడికి తినిపిస్తున్న వీడియోలు, వంట చేస్తున్న వీడియోలు, తన లవ్డ్ వన్స్‌తో టైమ్ స్పెండ్ చేస్తున్న వీడియోలు పోస్ట్ చేస్తుంటారు.ఆమె చార్మింగ్ అప్పియరెన్స్, గ్రేస్‌ఫుల్ పర్సనాలిటీ ఆమెకు ఆన్‌లైన్‌లో భారీ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయి.

ఈ వైరల్ క్లిప్ ఫన్నీ అండ్ రిలేటబుల్ రియాక్షన్స్‌ను కూడా స్ప్రెడ్ చేసింది.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం, ఒక వ్యూయర్ కామెంట్ చేస్తూ, “నేను ఆమె వయసు వాడినే కానీ ఇంకా పెళ్లి కాలేదు.” అని అన్నారు.

మరొకరు జోక్ చేస్తూ, “నేను 1970లలో పుట్టాను, నా పిల్లలు ఇంకా కిండర్ గార్డెన్‌లో ఉన్నారు.మీరు అమ్మమ్మ అవ్వడానికి అంత తొందరెందుకు పడ్డారు” అని నవ్వేశారు.

ఏజ్ డిఫైయింగ్ అప్పియరెన్స్‌తో ఈ అమ్మమ్మ ఇంటర్నెట్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తి, చైనాలో ట్రెండింగ్ సెన్సేషన్‌గా మారిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube