కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR directed by Koratala Siva) హీరోగా నటించిన చిత్రం దేవర(Devara ).ఇందులో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.ఇటీవల భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఎప్పటినుంచో వస్తున్న రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని సైతం ఈ సినిమాతో బ్రేక్ చేశారు తారక్.
మాములుగా రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరో చేసే సినిమాలు ఫ్లాప్ అవుతాయని టాలీవుడ్ లో ఒక సెంటిమెంట్ ఉంది.రాజమౌళితో సినిమాలు చేసిన తర్వాత హీరోలు నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
కానీ దాన్ని తారక్ బ్రేక్ చేశాడు.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో (Tarak in dual role in Devara movie)కనిపించాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్(NTR) లుక్, డైలాగ్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి.
ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా దేవర సినిమాను త్వరలోనే జపాన్ లో విడుదల చేయనున్నారు.
ఎన్టీఆర్ కు జపాన్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లోనూ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

జపాన్ లో ఆర్ఆర్ఆర్(japan, RRR) ప్రమోషన్స్ కూడా చేశారు ఎన్టీఆర్.అక్కడ తారక్ కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.కాగా ఇప్పుడు దేవర సినిమాను కూడా జపాన్ లో విడుదల చేయనున్నారు.కాగా దేవర సినిమా జపాన్ లో మార్చి 28, 2025న విడుదల కానుంది.ఎన్టీఆర్ మార్చి 22, 2025న జపాన్ వెళ్తున్నారు.అక్కడ సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు, ప్రెస్ కాన్ఫరెన్స్ లలో కూడా పాల్గొంటారని టాక్.
కాగా రీసెంట్ గా జపాన్ లో ఈ సినిమా ప్రత్యేక ప్రివ్యూ స్క్రీనింగ్ జరిగింది.జపాన్ లో జరిగిన ప్రత్యేక ప్రైవేట్ ప్రివ్యూ స్క్రీనింగ్ లో దేవర సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.
దాంతో తారక్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.