టాలీవుడ్ హీరో డార్లింగ్ ప్రభాస్ నాగ్ అశ్విన్ (Darling Prabhas, Nag Ashwin)కాంబినేషన్లో వచ్చిన మైతలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి(Kalki 2898 AD).ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.గత ఏడాది జూన్ లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇకపోతే ఈ మూవీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి 2(Kalki ) అప్‌డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఎవడే సుబ్రమణ్యం రీ రిలీజ్(Yevade Subramaniam re-release) సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.కల్కి 2 ఎప్పుడొస్తుందనే విషయంపై నాగ్ అశ్విన్ స్పందించారు.ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది.అది పూర్తయ్యాక షూటింగ్ మొదలు పెడతాము.సెకండ్ పార్ట్ లో భైరవ, కర్ణకు సంబంధించిన పార్ట్ ఎక్కువగా ఉంటుంది.
అంతా సజావుగా సాగితే ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి వెళ్లే ప్రయత్నం చేస్తాము.

కల్కిలో మహాభారతం నేపథ్యం, సుమతి, అశ్వత్థామ పాత్రలను డిజైన్ చేసుకుని ఇక్కడి వరకూ వచ్చాము.ప్రభాస్ ను పార్ట్ 2(Part 2)లో ఎక్కువగానే చూపిస్తాము.ఇంకా చాలా వర్క్ ఉంది.
విడుదల తేదీ గురించి ఇంకా ఏం డిసైడ్ చేయలేదు అని చెప్పుకొచ్చారు నాగ్ అశ్విన్.కాగా డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు ప్రభాస్.
ఈ సినిమాతో పాటు ఇంకా రెండు మూడు సినిమాలు ప్రభాస్ చేతిలో ఉన్నాయి.సందీప్ రెడ్డి వంగ,మారుతి సినిమాల తర్వాత కల్కి2 లో ప్రభాస్ నటించిన అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.