ప్రపంచవ్యాప్తంగా వీడియో కంటెంట్ కోసం ఎక్కువగా ఉపయోగించే ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ( YouTube ).గూగుల్‌కు చెందిన ఈ వీడియో షేరింగ్ వెబ్‌సైట్‌ను 2005లో ప్రారంభించారు.
వినియోగదారులు ఇందులో వీడియోలు అప్‌లోడ్ చేయడం, వీక్షించడం, షేర్ చేయడం ద్వారా అనేక రకాల సమాచారాన్ని పొందగలరు.యూట్యూబ్ ద్వారా చాలా మంది తమ ప్రతిభను ప్రపంచానికి తెలియజేసుకుని మంచి ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు.
యూట్యూబ్‌లో ఓ వ్యక్తి లేదా సంస్థ క్రియేట్ చేసిన ఛానెల్‌కు ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు( Subscribers ) ఉంటే, యూట్యూబ్ వారి కృషిని గుర్తిస్తూ ప్రత్యేకమైన అవార్డులను అందజేస్తుంది.వీటిని “ప్లే బటన్ అవార్డులు”( Play Button Awards ) అని అంటారు.
ఇందులో భాగంగా సిల్వర్ ప్లే బటన్ ను 1 లక్ష సబ్‌స్క్రైబర్లు దాటితే, గోల్డ్ ప్లే బటన్ ను 10 లక్షలు దాటితే, డైమండ్ ప్లే బటన్ ను 1 కోటి సబ్‌స్క్రైబర్లు దాటితే, రెడ్ డైమండ్ ప్లే బటన్ ను 10 కోట్లు దాటితే ఈ అవార్డులు కంటెంట్ క్రియేటర్లకు అందిస్తుంది గూగుల్.ఇది కంటెంట్ క్రియేటర్లకు ఒక గుర్తింపు మాత్రమే కాకుండా, వారి శ్రమకు మంచి ప్రోత్సాహంగా నిలుస్తాయి.ఇప్పుడు వీటికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ వీడియోలో ఓ వెల్డింగ్ షాపులో వ్యక్తి చెక్క, మెటల్ ప్లేట్లను వెల్డింగ్ చేసి, వాటిపై కలర్ వేసి, యూట్యూబ్ ప్లే బటన్ మాదిరిగా డిజైన్ చేస్తున్నాడు.
అంతేకాదు, వాటిపై పేర్లు కూడా ప్రింట్ చేసి నిజమైన యూట్యూబ్ అవార్డు మాదిరిగా తయారు చేస్తున్నాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.వీడియో చూసిన వారు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
యూట్యూబ్‌కు భారతదేశంలో విశేషమైన ఆదరణ ఉంది.రోజుకు లక్షల సంఖ్యలో వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి.2029 నాటికి, యూట్యూబ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 900 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా.ఈ ఘటనతో యూట్యూబ్ ప్లే బటన్‌లకు సంబంధించిన ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.నకిలీ ప్లే బటన్‌లు ఒక సరదాగా మారాయా? లేక, ఎవరికైనా ప్రామాణిక గుర్తింపుగా వినియోగిస్తారా? అన్నది మరి కాలమే సమాధానం చెప్పాలి.