మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan ) ఇటీవల గేమ్ చేంజర్( Game Changer ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల అయింది.
ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదలైనప్పటికీ ప్రేక్షకుల అంచనాలను మాత్రం చేరుకోవటంలో పూర్తిగా విఫలమైంది.శంకర్ లాంటి ఒక గొప్ప డైరెక్టర్ దర్శకత్వంలో రాంచరణ్ నటించిన సినిమా ఇలాంటి ఫలితం అందుకోవటంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోయారు.

ఇక ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దిల్ రాజు సుమారు 300 కోట్ల వరకు ఖర్చు చేసి ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు కానీ ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా పూర్తిగా నిరాశపరిచిందని చెప్పాలి.ఇక ఈ సినిమాకు తమన్ ( Thaman ) సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.సాధారణంగా శంకర్ డైరెక్షన్లో సినిమా వస్తుంది అంటే కచ్చితంగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటారు.అయితే ఈ సినిమా సమయంలో రెహమాన్ ఇతర సినిమా పనులలో బిజీగా ఉండటం వల్ల తమన్ ఈ సినిమాలో పనిచేశారు.

ఇక ఈ సినిమాలోని పాటలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.ఈ క్రమంలోనే ఈ సినిమాలో పాటలు ( Songs ) ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోవడానికి గల కారణాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తమన్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ…ఈ సినిమాలో నా సాంగ్స్ తగ్గట్టు హుక్ స్టెప్స్ లేవు.గతంలో వచ్చిన పాటలకు అంత క్రేజ్ రావడానికి కారణం అందులో ప్రతీ పాటకి హుక్ స్టెప్ ఉంటుందని తమన్ తెలిపారు.
మ్యూజిక్ విషయంలో సాంగ్స్ కి కేవలం 50 మిలియన్ వ్యూస్ వస్తాయి.మిగిలిన వ్యూస్ రావడానికి కొరియోగ్రాఫర్స్ కష్టం వుంటుందని తమన్ తెలిపారు.ప్రస్తుతం తమన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.