ప్రస్తుతం ఫౌజీ సినిమాతో( Fauji ) తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవాలని చూస్తున్న ప్రభాస్( Prabhas ) తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఇక మీదట చేయవలసిన సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
యావత్ ఇండియన్ స్క్రీన్ మీద ఆయనను మించిన నటుడు మరొకరు లేరని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఈ సందర్భంలో ఆయనతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు సినిమాలు చేయాలని అసక్తి చూపిస్తున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ అయిన రోహిత్ శెట్టి( Rohit Shetty ) సైతం ప్రభాస్ తో ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాని తెరకెక్కించాలని ప్రణాళికలు చేసుకుంటున్నాడు.

మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రోహిత్ శెట్టి కి ప్రభాస్ డేట్స్ ఇచ్చే అవకాశం అయితే లేదు.ఎందుకంటే ఆయన చేస్తున్న సినిమాల లైనప్ చాలా పెద్దగా ఉంది.కాబట్టి ఆ లైనప్ లో ఉన్న దర్శకుల సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా మీదకి ప్రభాస్ వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి నటుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది.రోహిత్ శెట్టి సినిమా అంటే రొటీన్ ఫార్ములా లో ఉంటుంది.
ప్రభాస్ అలాంటి సినిమాలను ఆయన చేయలేడని కొంతమంది అంటున్నారు.

ఇక ఏది ఏమైనా కూడా ప్రభాస్ ఐతే ఇప్పుడప్పుడే బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.మరి ఇలాంటి సందర్భంలో ఆయన కేవలం సౌత్ సినిమా దర్శకులపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక అందులో భాగంగానే ఈ సినిమాను తెరకెక్కించడంలో ఆయన చాలా బిజీగా ఉన్నాడట.
చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు ఆయనకు ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది…
.