ఈ సినిమాలతో రజినీకాంత్ సూపర్ హిట్ కొడుతాడా..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) లాంటి నటుడికి మంచి గుర్తింపు అయితే ఉంది.70 సంవత్సరాల వయసులో కూడా ఆయన ఎవ్వరికీ అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తూ వరుస సినిమాలను చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి నటుడికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.ప్రస్తుతం ఆయన కూలీ( Coolie ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) మరోసారి తన స్టామినా ఏంటో చూపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

 Will Rajinikanth Score A Super Hit With These Films Details, Rajinikanth, Rajini-TeluguStop.com
Telugu Coolie, Jailer, Rajinikanth-Movie

దానికి తగ్గట్టుగానే రజినీకాంత్ ని గ్యాంగ్ స్టార్ గా చూపించే ప్రయత్నమైతే చేస్తున్నాడు.ఇక ఇలాంటి పాత్రలో రజనీకాంత్ ఎలా చెలరేగిపోతాడు అనేది చూడడానికి యావత్ ఇండియన్ సినిమా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక లోకేష్ కనకరాజు ఇంతకుముందు చేసిన లియో సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.దాంతో ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి ఎలాగైనా సరే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో లోకేష్ కనకరాజు ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.రజనీకాంత్ లాంటి నటుడు ఈ ఏజ్ లో కూడా విపరీతంగా కష్టపడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

 Will Rajinikanth Score A Super Hit With These Films Details, Rajinikanth, Rajini-TeluguStop.com
Telugu Coolie, Jailer, Rajinikanth-Movie

తన గత చిత్రం ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు ఎలాగైనా సరే ఒక భారీ సక్సెస్ ను సాధించి సీనియర్ హీరోలందరిలో తనే టాప్ హీరో అని నిరూపించుకుంటానని రజనీకాంత్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.ఇక ఈ సినిమాతో పాటుగా నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ 2( Jailer 2 ) అనే సినిమా కూడా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు…చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube