పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్)( Provident Fund ) అనేది ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం భారత ప్రభుత్వం అందించే ప్రత్యేక పొదుపు పథకం.ప్రతి ఉద్యోగి తన జీతం నుండి కొంత భాగాన్ని పీఎఫ్ ఖాతాలో చెల్లిస్తాడు.
అదే విధంగా సంస్థ కూడా కొద్దీ మొత్తాన్ని అందిస్తుంది.ఈ డబ్బులు ఉద్యోగం నుండి రిటైర్మెంట్ సమయంలో లేదా అత్యవసర సందర్భాల్లో ఉపయోగపడుతుంది.
కానీ ప్రస్తుతం పీఎఫ్ ఖాతా డబ్బులను విత్‌డ్రా చేసుకోవడానికి అనేక పరిమితులు ఉన్నాయి.ప్రస్తుతం పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
బ్యాంకు ఖాతా వివరాలు, చిరునామా వంటి వివరణలను సమర్పించాలి.దరఖాస్తు అంగీకరించడానికి ఒక వారం నుంచి 15 రోజులు సమయం పడుతుంది.
అయితే, కొన్ని సందర్భాల్లో సమస్యలు తలెత్తితే, డబ్బు విత్‌డ్రా ప్రక్రియ మరింత ఆలస్యం కావచ్చు.

ఇక ఈ సమస్యలకు పరిష్కారంగా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ( EPFO ) కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది.జూన్ 2025 నుండి, పీఎఫ్ ఖాతాదారులందరికీ ప్రత్యేకమైన కార్డులను అందించనుంది.ఈ కార్డు, సాధారణ ఏటీఎం( ATM ) కార్డుల్లాగే ఉండి, దీనిని ఉపయోగించి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులను విత్‌డ్రా( PF Withdraw ) చేసుకోవచ్చు.
ఈ కొత్త విధానంతో కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.ఇకపై ఏటీఎం కార్డు ద్వారా తక్షణమే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా, నేరుగా ఏటీఎం ద్వారా డబ్బును తీసుకోవచ్చు.బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని ఉద్యోగులు కూడా ఈ విధానంతో లబ్ధి పొందవచ్చు.
అనుకోని అవసరాలు వచ్చినప్పుడు, దరఖాస్తు, నిరీక్షణ అవసరం లేకుండా వెంటనే డబ్బును పొందొచ్చు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఏటీఎం ద్వారా పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం 50% వరకు విత్‌డ్రా చేయగలుగుతారు.అయితే, ఒక్కో లావాదేవీకి గరిష్ఠ పరిమితి ఎంత, రోజుకు ఎంత వరకు డబ్బు విత్‌డ్రా చేయగలుగుతారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.ఈ కొత్త పీఎఫ్ విత్‌డ్రాయల్ కార్డు ఒక డెబిట్ కార్డు మాదిరిగానే పని చేస్తుందని సమాచారం.
దీని ద్వారా ఆన్‌లైన్ లేదా POS ట్రాన్సాక్షన్లను కూడా నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పీఎఫ్ ఖాతా డబ్బులను ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసే విధానం ఉద్యోగులకు గొప్ప ఉపశమనంగా మారనుంది.
తక్షణ లావాదేవీలకు ఇది సహాయపడుతుందని, దీని ద్వారా ఉద్యోగులు మరింత వేగంగా, సులభంగా తమ పొదుపు మొత్తాన్ని వినియోగించుకోగలుగుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే, పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించిన తర్వాత మరిన్ని స్పష్టతలు తెలుస్తాయి.