టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) గురించి మనందరికీ తెలిసిందే.నాగార్జున ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
అయితే నాగార్జున సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆయన నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించడం లేదు.ఇలా నాగార్జున కెరియర్ లో సరైన సక్సెస్ సినిమా అందుకని చాలా కాలం అయ్యింది.
దీంతో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు నాగార్జున.టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ మెప్పిస్తున్నారు.
ఇకపోతే నాగార్జున 100వ సినిమాకు( Nagarjuna 100th Movie ) చేరువయ్యారు.

నాగార్జున హీరో కా నటించిన సినిమాలు 100 పూర్తి కాలేదు కానీ స్పెషల్ రోల్ కొన్ని నిమిషాలు, క్యామియో పాత్రలు ఇవన్నీ కలుపుకుంటే 100 ఎప్పుడు దాటిందని చెప్పాలి.ఇకపోతే ఇప్పుడు నాగార్జున వందవ సినిమాకు ఒక డైరెక్టర్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.తమిళ దర్శకుడు కార్తీక్( Tamil Director Karthik ) నాగార్జున వందవ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే నిజానికీ ఈ టాక్ నెలల క్రితమే వచ్చింది కానీ నాగార్జున ఫైనల్ నెరేషన్ పట్ల అంత సంతృప్తి వ్యక్తం చేయకపోవడంతో లీక్ దగ్గరే ఆగిపోయింది.కాగా తాజాగా అందిన సమాచారం ప్రకారం నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ఇంతకీ కార్తీక్ ఎవరంటే 2022 అశోక్ సెల్వన్ హీరోగా నటించిన నితం ఓరువానం అనే సినిమా ద్వారా దర్శకత్వ డెబ్యూ చేశాడు.రీతూ వర్మ, అపర్ణ బాలమురళి, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటించారు.తమిళంలో విమర్శకులు మెచ్చుకున్నారు.ఈ మూవీ తెలుగులో ఆకాశం పేరుతో రిలీజ్ చేయగా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.అసలు ఈ సినిమా విడుదలైన విషయం కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.తర్వాత అతను గ్యాప్ తీసుకున్నాడు.
ప్యాన్ ఇండియా బడ్జెట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్టోరీ సిద్ధం చేశారట.ఇటీవలే కూలి షూటింగ్ బ్రేక్ లో జరిగిన చర్చలో నాగార్జున సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తోంది.
కాగా నిజానికీ వందో సినిమా గాడ్ ఫాదర్ ఫేమ్ మోహన్ రాజాకు దక్కాల్సింది.తండ్రి కొడుకులు నాగార్జున, అఖిల్ ప్రధాన పాత్రల్లో ఆయనో సబ్జెక్టు తయారు చేసుకున్నాడని ఆ మధ్య వినిపించింది.
తర్వాత ఆయన పక్కకు తప్పుకోవడంతో ఇప్పుడు కార్తీక్ ది కార్యరూపం దాల్చ బోతున్నారు అనే వార్త వైరల్ గా మారింది.ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.