లవ్ టుడే సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రదీప్ రంగనాథన్.ఈ సినిమా తరువాత ప్రదీప్ నటించిన లేటెస్ట్ మూవీ డ్రాగన్.
ఇటీవల విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.
ఈ సినిమా పూర్తి యూత్‌ఫుల్ కంటెంట్ తో రావడంతో ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.ప్రేక్షకుల నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తోంది.

అశ్వత్ మారిముత్తు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా థియేటర్లో విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించింది.దీంతో ఓటీటీ ప్రియులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా ఓటీటీ డేట్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అనేక కథనాలు అనేక రకాల డేట్లు కూడా వినిపించాయి.

అయితే తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం ఈ మార్చ్ 21 నుంచి పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు అనౌన్స్ చేసేసారు.కాబట్టి అప్పుడు ఈ సినిమాని ఎవరైనా మిస్ అయితే ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే థియేటర్లో విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన ఈ ఓటీటీలో ఏ మేరకు సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి మరి.