బీహార్‌లోని( Bihar ) వైశాలి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.హోలీ వేడుకల వేళ ప్రియాంక దేవి( Priyanka Devi ) అనే భార్య, తన భర్త మిథిలేష్ పాశ్వాన్‌ను కత్తితో పొడిచి చంపేసింది.
అసలేం జరిగిందంటే, మిథిలేష్, ప్రియాంకను ప్రియుడితో( Boyfriend ) ఫోన్‌లో చాటింగ్ చేస్తూ ఉండగా చూశాడు.
మిథిలేష్ ఫోన్ గురించి అడగటంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది.
మాటా మాటా పెరిగి ఇద్దరూ ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు.ఆవేశంతో ప్రియాంక కత్తి పట్టుకుని మిథిలేష్‌పై విరుచుకుపడింది.
దాంతో అతని ప్రైవేట్ పార్ట్‌లను నరికేసింది.మిథిలేష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
చుట్టుపక్కల వాళ్లు చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు.పోలీసులు వచ్చేలోపే మిథిలేష్ ప్రాణాలు విడిచాడు.

వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ప్రియాంకను అరెస్ట్ చేశారు.అసలు ఈమె ఎందుకు అంత దారుణానికి ఒడిగట్టిందో అని పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు.అయితే, ఈ కేసు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.ఒకవేళ ఇదే పని మగాడు చేసి ఉంటే, అప్పుడేం జరిగేది? దేశం మొత్తం నిరసనలతో మండిపోయేది.‘మగవాళ్ల హింస’, ‘టాక్సిక్ మస్కులినిటీ’ అంటూ మీడియా హోరెత్తిపోయేది అని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

“ఇదే నేరం మగవాడు చేసి ఉంటే పితృస్వామ్య వ్యవస్థను తిడుతూ అందరూ గొంతులు చించుకునేవారు.కానీ, ఇక్కడ నేరస్థురాలు ఒక ఆడది కాబట్టి, అందరూ లైట్ తీసుకుంటున్నారు.‘ఇది మామూలు కుటుంబ గొడవలే’ అని ఊరుకుంటున్నారు.” అని ఒక వ్యక్తి అన్నాడు.ఏది ఏమైనా ఇలాంటి దారుణమైన హత్య జరగడం నిజంగా దురదృష్టకరం.
వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో ఈ ఘటనతో మరోసారి నిరూపితమైంది.పెళ్లయ్యాక ఇతరుల వైపు చూడకపోవడమే మంచిదని పోలీసులు సైతం హెచ్చరిస్తున్నారు.