రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పపూర్ గ్రామానికి చెందిన ముత్యాల సుధా – అశోక్ రెడ్డి కుమారుడు ముత్యాల మనోజ్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం నుండి అండర్ 17 వాలీబాల్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు.మనోజ్ రెడ్డి బొప్పాపూర్ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతున్నారు.
ఎస్జీఎఫ్ స్కూల్ గేమ్స్ లో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాణించి రాష్ట్రస్థాయిలో తన ప్రతిభను చాటుకున్నారు.జాతీయస్థాయిలో నవంబర్లో 6వ తేదీ నుండి 10వ తేదీ మధ్యలో ఉత్తరప్రదేశ్లో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు.