చాట్స్ అంటే ఇష్టపడని వారుండరు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వీటిని ఇష్టంగా తింటుంటాయి.
అయితే కొన్ని కొన్ని చాట్స్ తినేందుకు రుచిగా ఉండటమే కాదు.ఆరోగ్యానికి బోలెడన్ని ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అయితే అటువంటి వాటిలో ఇప్పుడు చెప్పుకోబోయే చాట్ కూడా ఒకటి.ఈ చాట్ ను డిన్నర్ లో తింటే ఒంట్లో ఉన్న కొవ్వును కరగడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చు.
మరి ఆలస్యం చేయకుండా ఆ చాట్ ఏంటో.ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కప్పు సన్నగా తరిగిన పైనాపిల్(బాగా పండినది) ముక్కలు వేసుకోవాలి.ఆ తర్వాత తరిగిన కీరా ముక్కలు మూడు టేబుల్ స్పూన్లు, రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము, మూడు టేబుల్ స్పూన్ల యాపిల్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల టమాటో ముక్కలు, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ తరిగిన కొత్తి మీర, అర కప్పు వేయించిన వేరుశనగలు, ఒక కప్పు మరమరాలు, హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకుంటే చాట్ సిద్ధమైనట్లే.

ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్తీ పైనాపిల్ చాట్‌ను డిన్నర్‌లో గనుక తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి వేగంగా బరువు తగ్గుతారు.అతి ఆకలి దూరం అవుతుంది.జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా మెరిసిపోతుంది.
ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.రోగ నిరోధక శక్తి రెట్టింపు అవుతుంది.
మరియు గుండె ఆరోగ్యం సైతం మెరుగ్గా మారుతుంది.