నేర పరిశోనలో కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు

సూర్యాపేట జిల్లా:జాతీయ సమైక్యత దినోత్సవం సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్బంగా కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ నేర పరిశోధనలో అత్యున్నతమైన ప్రతిభా పాటవాలకు గుర్తింపుగా సూర్యాపేట జిల్లా కోదాడ సబ్ డివిజన్ డిఎస్పీ మామిళ్ళ శ్రీధర్ రెడ్డికి 2024 సంవత్సరానికి కేంద్ర హోంమంత్రి దక్షత పతాకాన్ని ప్రకటించింది.1998 నవంబర్ లో సబ్-ఇన్స్ పెక్టర్ గా ఎంపికైన మామిళ్ల శ్రీధర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాచకొండ కమిషనెరేట్ మరియు ప్రత్యేక నిఘా విభాగంలో పనిచేశారు.ప్రతిష్ట్మాకమైన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళానికి దేశం తరుపున ఎంపికై 2016- 17లో హైతీ దేశంలో పోలిస్ ఆపరేషన్స్ ప్లానింగ్ అధికారిగా పని చేశారు.సంచలనాత్మక హాజీపూర్ కేసులో ముగ్గురు మైనర్ బాలికల అత్యాచారం,హత్య చేసిన నిందితుడిని తన సాంకేతికత నైపుణ్యాన్ని ఉపయోగించి స్వల్పకాలంలోనే అరెస్ట్ చేయడంలో అత్యంత కీలక పాత్ర పోషించటం, సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం ఫ్యాక్షన్ హత్య కేసు,మరో మూడు హత్య,అనేక దోపిడీ,దొంగతనాల కేసుల్లో తనదైన శైలీలో దర్యాప్తు చేసి త్వరితగతిన కేసులను ఛేదించి,కృషి,పట్టుదలతో అనేక కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా విధులను నిర్వహిస్తూ,అనేక సందర్భాల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు.26 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో అనేక కీలకమైన శాంతి భద్రతల విషయాల్లో, సామాజిక విషయాల్లో పోలీస్ ప్రజా సంబంధాలను పటిష్టం చేయటంలో,అనేక తీవ్రవాద,దోపిడీ,హత్య మనుషుల అక్రమ రవాణా,అక్రమ ఆయుధాల కేసుల్లో తన ప్రతిభ పాటవాలను గుర్తించి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకున్నారు.గతంలో కూడా పోలీస్ సేవ పతాకాన్ని,తెలంగాణ రాష్ట్ర శౌర్య పతాకాన్ని, ఉత్తమ సేవ పతాకాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పతాకాన్ని ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ బహుకరించటం జరిగింది.2015లో పంజాబ్ లో జరిగిన అఖిల భారత స్థాయి డ్యూటీ మీట్ లో ఫోరెన్సిక్ సైన్స్ విభాగంలో రజత పతాకాన్ని సాధించారు.2017 లో ఐక్యరాజ్య సమితి శాంతి పతాకాన్ని సాధించారు.మరో రెండొందలకు పైగా రివార్డులు అవార్డులు పొందారు.ఈ సందర్బంగా రాష్ట్ర డీజీపీ జితేందర్, శాంతిభద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్, జోనల్ ఐజీపీ సత్యనారాయణ,సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్,అదనపు ఎస్పీ నాగేశ్వర్ రావు ఇతర అధికారులు ఆయనను అభినందించారు.

 Special Recognition For Kodada Dsp Sridhar Reddy In Criminal Investigation, Dsp-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube