ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లాలలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం దాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని సచివాలయం నుంచి ధాన్యం కొనుగోలు పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

 Grain Purchase Centers Should Be Started Immediately Minister Uttam Kumar Reddy,-TeluguStop.com

ధాన్యం కొనుగోలు పై తీసుకోవాల్సిన చర్యల గురించి పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.చౌహన్ అధికారులకు సూచించారు.

మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, ఏ చిన్న ఇబ్బంది లేకుండా సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు జరిగేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు.

ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని అన్నారు.సన్న రకం ధాన్యం సాగు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్వింటాల్ 500 రూపాయల బోనస్ ప్రకటించిందని తెలిపారు.

జిల్లాలో రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం దాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ప్యాడీ క్లీనర్, ఇతర సామాగ్రి వెంటనే యుద్ద ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అన్నారు.దొడ్డు రకం ధాన్యం సన్న రకం కోనుగోలు కేంద్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని అన్నారు.

జిల్లాలో రైస్ మిల్లర్ల వద్ద తాళ్ళు పేరుతో ఎటువంటి ధాన్యం కోతలు జర్గవద్దని, కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యత ప్రమాణాలు పరిశీలించిన తర్వాత కొనుగోలు చేయాలని, రైతుకు ఎటువంటి నష్టం రావడానికి వీలు లేదని మంత్రి స్పష్టం చేశారు.ధాన్యం నాణ్యత ప్రమాణాలను విస్తృతంగా ప్రచారం చేయాలని, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని రావాలని మంత్రి సూచించారు.

జిల్లాలోని రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయింపు కోసం బ్యాంకు గ్యారంటీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసిందని, aవీటిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్నారు.రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహించాలని, జీఓ 27 పై చర్చించాలని, రైస్ మిల్లర్లచే బ్యాంక్ గ్యారంటీ సమర్పిస్తామని అండర్ టేకింగ్ తీసుకుని ధాన్యం కేటాయింపు చేయవచ్చని అన్నారు.

రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ సమర్పించని పక్షంలో జిల్లాలో కొనుగోలు చేసిన ధాన్యం భద్ర పరిచేందుకు అవసరమైన మేర ఇంటర్మీడియట్ గో డౌన్ సన్నద్ధం చేయాలని, ప్రతి జిల్లాలో ధాన్యం కొనుగోలు ఫోన్ నెంబర్ తో కూడిన గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా 48 గంటల్లో చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని అన్నారు.

పక్క రాష్ట్రాల ధాన్యం మన కొనుగోలు కేంద్రాలకు రాకుండా బార్డర్ల వద్ద చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 175 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, నేడు మరో 73 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 27 పై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించామని, ముందుగా రైస్ మిల్లర్లు అండర్ టేకింగ్ సమర్పించి తర్వాత బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని సమాచారం అందించామని, సిరిసిల్ల జిల్లాలో అవసరమైన మేర ఇంటర్మీడియట్ గోడౌన్లకు గాను ఆపీరియల్ పార్క్ వద్ద స్పేస్ అందుబాటులో ఉందని, రైతులు ధాన్యం తెచ్చిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.అనంతరం జిల్లాలో ప్రారంభించని 73 కొనుగోలు కేంద్రాలను సాయంత్రం నాటికి ప్రారంభించాలని కలెక్టర్ జిల్లా సహకార అధికారిని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఖీమ్యా నాయక్, డిఎం సివిల్ సప్లై రజిత, డి.సి ఎస్.ఓ.వసంత లక్ష్మి ,డి సి ఓ రామకృష్ణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube