17వ పోలీస్ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి(జాతీయ ఐక్యత దినోత్సవం) సందర్భంగా 17వ బెటాలియన్ సర్థాపూర్ లో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ సి.హెచ్ సాంబశివ రావు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చిత్రపటానికి పూలువేసి నివాళులర్పించారు.

 Sardaar Vallabhbhai Patel Birth Anniversary Celebrations In 17th Police Battalio-TeluguStop.com

అనంతరం బెటాలియన్ పోలీస్ అధికారులు, సిబ్బంది అందరి చేత అసిస్టెంట్ కమాండెంట్ సి.హెచ్ సాంబశివ రావు ప్రతిజ్ఞ చేయించారు.

“సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చర్యలు, సూచనల ద్వారా భారతదేశం యొక్క ఏకీకరణకు పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.నా దేశం యొక్క అంతర్గత ,శాంతి భద్రతలకు నాయొక్క సహాయ సహకారాలు అందిస్తానని , నా దేశం యొక్క ఐక్యతకు పాటుపడుతూ దేశ భద్రతకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని నా ప్రతిజ్ఞ” అని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడుగా, భారత తొలి ఉప ప్రధానిగా, హోమ్ మినిస్టర్ గా భారతదేశానికి విశిష్ట సేవలు అందించారని పేర్కొన్నారు దేశం క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు రాచరిక సంస్థానాల విలీనంలో వల్లభాయ్ పటేల్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్, జూనాగడ్ వంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారు అని పేర్కొన్నారు.దేశ ఐక్యతకు పాటుపడిన మహనీయుడు అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube