రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించిన ఏబీవీపీ నాయకులు గురుకుల పాఠశాలలో పిఈటితో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోడ్డుపై విద్యార్థులు ఆందోళన చేయగా ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు గురుకుల పాఠశాలకు వెళ్లి మాట్లాడారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం పైన స్పందించాలన్నారు.
పీఈటి, ప్రిన్సిపాల్ లపైన కేసులు నమోదు చేసి సర్వీస్ రెమువల్ చేయాలి అని డిమాండ్ చేశారు.విద్యార్థినిల ఫొటోస్,వీడియోస్ లను వీడియో లు పి ఈ టీ ఎందుకు తీసిందో పూర్తి విషయాలు ఎంక్వయిరీ కమిటీ వేసి ఇంకా ఎవరు ఎవరు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవలన్నారు.
బాత్ రూమ్స్ టాయిలెట్స్ సరిపోక విద్యార్థినిలు ఉదయం 4 గంటలకు లేచి క్యూ లైన్ కడుతున్న దుస్థితి గతంలో విద్యార్థినిలు అధికారులకు చెప్పిన వారు పట్టించుకోలేరన్నారు.
గురుకుల హాస్టల్స్( Gurukula Hostels) లో జరుగుతున్న విషయాలపైన హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయాలని వెంటనే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో తీవ్రఉద్యమాలు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్,జిల్లా కన్వీనర్ లోపెల్లి రాజు రావు, విభాగ్ లా కన్వీనర్ సామానపల్లి ప్రశాంత్, ఎల్లగందుల శ్రీనివాస్, ధనుష్, తిరుపతి, కార్తీక్, శివ తదితరులు పాల్గొన్నారు.