బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్( Kancharla Ravi Goud ) విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని నూతన కమిటీకి పిలుపునిచ్చారు.రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జూనియర్ కళాశాల లో బీసీ విద్యార్థి సంఘం కళాశాల కమిటీని ప్రకటించిన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘం బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కమిటీ వేయడం జరుగుతుందని అన్నారు.జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని బీసీ విద్యార్థి రాష్ట్ర కమిటీ ( BC Student State Committee )పక్షాన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులే ఉంటారని ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.అనంతరం కాలేజ్ కమిటీ అధ్యక్షుడిగా చిట్టబోయిన రాకేష్, ప్రధాన కార్యదర్శిగా గోరు రాకేష్ ను, ఉపాధ్యక్షులుగా ముందుగుల లక్ష్మణ్,కార్యదర్శులుగా బత్తుల రేవంత్,కొంచెం సంజీవ్, కార్యవర్గ సభ్యులుగా శంకర్, స్వామి కార్యవర్గాన్ని ప్రకటించిన రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.
అయన వెంట సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు రుద్రవీణ సుజిత్ కుమార్, నాయకులు రామ్ చరణ్, హరికృష్ణ, అబ్దుల్ ఖాసీం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.







