జిల్లా కేంద్రంలో విద్యార్థుల చేత ట్రాఫిక్, రోడ్ భద్రత నియమలపై ఫ్లాష్ మాబ్: సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కృష్ణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద ఈ రోజు శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన విద్యార్థుల చేత ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియమలు ,రోడ్ ప్రమాదాల నిర్ములనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ అవగాహన కల్పించడం జరిగింది.ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో ప్లాకార్డ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరిని ఆకట్టుకున్నాయి.

 Flash Mob On Traffic And Road Safety Rules By Students In District Center Sirisi-TeluguStop.com

అనంతరం సి.ఐ మాట్లాడుతూ ప్రతి వాహన దారుడు ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పని సరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, బయటకు వెళ్ళిన తన కోసం కుటుంబ సభ్యులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటరన్న విషయాన్ని వాహన దారులు గుర్తించాలని, అనుకొని ప్రమాదాల వల్ల కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కును కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని కావున వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు.ప్రతి వాహన దారుడు తప్పకుండా హెల్మెట్, షీట్ బెల్ట్ ధరించాలని , అతి వేగం, ర్యాస్ డ్రైవింగ్, మద్యం త్రాగి డ్రైవింగ్ చేయటం, మొబైల్స్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయటం వంటివి చేయవద్దని,రాంగ్ రూట్ లో వాహనాలు నడుపవద్దని ప్రతి ఒక్కరు విధిగా ట్రాఫిక్ ,రోడ్ భద్రత నియమాలు పాటించాలి అన్నారు.సి.ఐ వెంట ట్రాఫిక్ ఎస్.ఐ దిలీప్ ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube