సార్ నా అన్నది ఇంటర్ అయిపోయింది.డిగ్రీ కాలేజ్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.ప్రజావాణిలో చిన్నారుల పిర్యాదు.అవాక్కయిన తహశీల్దార్.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల తహాసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒగ్గు శ్రీనిధి యాదవ్, ఒగ్గు వ్రీశాంక్ యాదవ్ మండల తహాసిల్దార్ జయంత్ కుమార్ కు సారు మా అన్నది పన్నెండో తరగతి అయిపోయింది.మా అన్నకు ఎంపీసీ సెకండ్ ఇయర్ లో 951/1000మార్కులు వచ్చినాయి.
ఇప్పుడు డిగ్రీ చదువుకోవాలనుకుంటున్నాడు.ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మా అన్న లాంటి వాళ్లు డిగ్రీ చదువుకోవడానికి కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్ లాంటి దూర పట్టణాలకు వెళుతున్నారు.
దీంతో ఆర్థిక భారం ఎక్కువ అయితాంది.
ఈ ఏడాదిఇంటర్ పూర్తి చేసిన వారి ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఏడాది ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కళాశాల ప్రారంభించి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తే వందల మంది చదువుకుంటారు సారు.ఈ ఏడాది డిగ్రీ కళాశాల ప్రారంభించి మా అన్న ఒగ్గు వికాస్ యాదవ్ లాంటివారు ఇంటర్ పూర్తి చేసుకున్న వారి కోసం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
సారు ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ చదువులను కొనసాగిస్తారని దండం పెట్టి మరి చిన్నోడు ప్రజావాణిలో తహసిల్దార్ కు వినతిపత్రం అందించాడు.చిన్నోడు ఐదు సంవత్సరాల అబ్బాయి వయసు గల చిన్నొడు కావడంతో మండల తహాసిల్దార్ ఛాంబర్ లోకి వెళ్లి దండం పెట్టడంతో మండల తహాసిల్దార్ జయంత్ కుమార్ అవాక్కయ్యారు.