రాజన్న సిరిసిల్ల జిల్లా: ‘డూ డూ బసవన్న.రా రా బసవన్నా.
’ సంక్రాంతి పర్వదినాల్లో ఇంటింటికీ తిరుగుతూ గంగిరెద్దులను ఆడిస్తారు.తమ ఇంటికొచ్చిన గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుడి స్వరూపంగా భావించి ఇంటివాళ్లు హారతి పట్టి పూజిస్తారు.
‘డూ డూ బసవన్న.రా రా బసవన్నా.’ అనగానే ఎద్దులు ముందుకు వస్తాయి.‘అమ్మవారికి దండంబెట్టూ.అయ్యగారికి దండంబెట్టు’ అనగానే ముందరి కాలెత్తి సలాం చేస్తాయి.‘అయ్యగారికి శుభం కలుగుతుందా!’ అనగానే గంగిరెద్దులు తలాడించడాన్ని శుభ సూచకంగా, నందీశ్వరుడి దీవెనగా భావిస్తారు.







