స్థానిక సంస్థల ఎన్నికలకు భయపడి బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేస్తుందని, డిఎంహెచ్వో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తుందని బి ఆర్ ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో, మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆర్ఎంపీలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన నేతలపై ఎందుకు అధికారులచే, పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ప్రశ్నించారు.
డిఎంహెచ్ఓను వివరణ కోరగా కలెక్టర్ ఆదేశాలతో సీజ్ చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కనీసం అవగాహన లేకుండా జిల్లా వైద్యాధికారి ప్రవర్తిస్తున్నారని, విధులు నిర్వర్తించాలని లేకుంటే రాజీనామా చేయాలని, లేదా లీవ్ లో వెళ్ళిపోవాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఆర్ఎంపీల విషయం ఉందని దానిని ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మర్చిపోవద్దన్నారు.
బిఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తే చట్ట ప్రకారంగా వెళ్తామని అన్నారు.
ఈ సమావేశంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, నాయకులు రాఘవరెడ్డి, రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు గోలి మహేష్, సిరిగిరి చందు, కొండ కనకయ్య, నరాల శేఖర్, నాయకులు వెంగల శ్రీకాంత్ గౌడ్, కమలాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రేమ్ చారి, సుంకపాక రాజు, సంధ్యరాణి, సందీప్, రాకేష్, సాయి, ఉమర్, రఫీక్ , అసద్, మండల అధ్యక్షులు మల్యాల దేవయ్య, నాయకులు డప్పుల అశోక్, ప్రభాకర్ రావు, మంతెన సంతోష్, ప్యాక్స్ ఛైర్మెన్ రామ్ మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.