నులిపురుగులు నివారణకు కృషి చేయాలి..

రాజన్న సిరిసిల్ల జిల్లా:ఈ నెల 20న నిర్వహించే అంతర్జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం( National Deworming Day ) సందర్భంగా మండల వైద్యాధికారి డా.స్రవంతి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

 Efforts Should Be Made To Prevent Worms.-TeluguStop.com

పీహెచ్‌సీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, పాఠశాలల ఉపాధ్యాయులతో డా.స్రవంతి, సూపర్‌వైజర్ మేరీ లు, వీర్నపల్లి మండలం లో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ చిరంజీవి ,పద్మలు సూపర్‌వైజర్ సమావేశం నిర్వహించారు.కార్యక్రమంలో ఎన్ డి డి యొక్క ప్రాముఖ్యత,పిల్లల లో వచ్చే రక్త హీనతను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.మండల పరిధిలో 1 నుండి 19 సంవత్సరాల వయస్సు పిల్లలు సుమారు 16 వేల మంది రక్త హీనత తో బాధ పడుతున్నారని, వారందరు ఈ ఎన్ డి డి కి అర్హులుగా గుర్తించిన్నట్లు వైద్యది కారి స్రవంతి తెలిపారు.

1 నుండి 2 సంవత్సరాల వయసు పిల్ల లకు 200 ఎంజి , 2 సంవత్సరాల పై నుండీ 19 సంవత్సరాల పిల్లాలకు 400 ఎం జి అనగా పూర్తి టాబ్లెట్‌( Tablets )ను నమిలి మింగమని చెప్పాలని, టాబ్లెట్ ను ఖాళీ కడుపుతో ఇవ్వకూడదని, దీర్ఘ కాలిక వ్యాధితో బాధపడ్డవారికి,జ్వరం తో బాధ పడే వారికీ, ఇటీవలి కాలంలో హాస్పిటల్ లో అడ్మిట్ అయినవారికి,ఏదయినా ఆరోగ్య సమస్య ఉన్నట్లైతే వారందరికీ ఈ నెల 27వ తేదీ రోజున నిర్వహించే మాప్ అప్ రోజు ఎన్ డి డి వేయించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ వివరించారు.ఈ శిక్షణలో పీహెచ్‌సీ సిబ్బంది, మండల పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube