రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలము దేశాయ్ పల్లి గ్రామములో ఇండ్లు లేని పేదలను సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వారిని కలిసి వారి బాధలను తెలుసుకోవడము జరిగింది.ఈ ప్రభుత్వం ఇండ్లు లేని నిరు పేదలకు డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తామని వాగ్దానం ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్న కూడా ఈ జిల్లాలో మండలాల వారిగా చూసుకొంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కట్టి ఇచ్చిన దాకలాలు లేవన్నారు .
హరిత హారము పేరిట వందల కోట్ల రూపాయలు వృధా చేస్తున్న ఈ ప్రభుత్వం, నిరుపేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ విషయములో మాత్రము ఈ ప్రభుత్వం మీనా మీసాలు లెక్కిస్తుందని,ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేసుకొంటే బాగుంటుందని అన్నారు .ఇప్పటికైనా ఈ బోయినిపల్లి మండలములో గ్రామాల వారిగా ఇండ్లులేని నిరు పేదలను అర్హత గలవారిని గుర్తించి డబుల్ బెడ్ రూమ్ కట్టి ఇవ్వాలని బోయినిపల్లి మండల సీపీఎం పార్టీ పక్షణ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమములో ఇండ్లు లేని నిరు పెద మహిళలు వావిలాల బుజవ్వ, కనుకవ్వ, లక్ష్మి, శెంకర్, మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్తదితరులు పాల్గొన్నారు.