రాజన్న సిరిసిల్ల జిల్లా :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా పథకానికి అర్హులను గుర్తించాలని, వ్యవసాయ యోగ్యంకాని భూములు గుర్తించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు.ఎల్లారెడ్డిపేట మండలం సింగారం, ముస్తాబాద్ మండలం మద్దికుంట లో రైతు భరోసా కోసం సర్వే శుక్రవారం కొనసాగుతుండగా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వివిధ పథకాల అమలు కోసం కొనసాగుతున్న సర్వే పై ఆరా తీశారు.అనంతరం ఆయన మాట్లాడారు.
సర్వే పకడ్బందిగా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన వన అధికారి లత, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ తహసీల్దార్లు రాంచంద్రం, సురేష్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.







