రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారితో పాటు దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెలకొల్పిన అమ్మవారిని కూడా మంగళవారం వేములవాడ ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Government Whip Adi Srinivas)దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకోగానే అర్చకులు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
స్వామి వారి దర్శనానంతరం అర్చకములు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను ఆలయ ఈవో వినోద్ రెడ్డి శాలువా ప్రసాదం అందజేశారు.వారి వెంట ఏఈఓలు బ్రాహ్మణ గారి శ్రీనివాస్ జి.రమేష్ ఆలయ పర్యవేక్షకులు తిరుపతిరావు ప్రోటోకాల్ పర్యవేక్షకులు అశోక్ ఉన్నారు.