గోర్లు అందంగా, ఆకర్షనీయంగా కనిపించాలని దాదాపు అందరమ్మాయిలు నెయిల్ పాలిష్ వేసుకుంటుంటారు.నిజంగానే నెయిల్ పోలిష్ గోర్లు మరియు వేళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుంది.
అయితే ఒకప్పుడు ఏదైనా ఫంక్షన్‌కు లేదా ఏమైనా అకేషన్ ఉంటేనే నెయిల్ పాలిస్ వేసుకునేవారు.కానీ, ఇటీవల కాలంలో సమయం లేకపోయినా.
సందర్భంగా రాకపోయినా గోర్లకు తరచూ నెయిల్ పాలిష్‌లు వేసుకుంటున్నారు.కొందరైతే రోజూ వేసుకునే డ్రెస్సుకు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటారు.
మరికొందరైతే ఒక్కో వేలు ఒక్కో రంగు వేసుకోవడంతో పాటు.వాటిపై రకరకాల డిజైన్లు కూడా వేసుకుంటున్నారు.
అయితే గోర్లకు నెయి పాలిష్‌లు అందాన్ని ఇచ్చినప్పటికీ. ఆరోగ్య పరంగా అవి ఏ మాత్రం మంచివి కావని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా నెయిల్ పాలిష్ తరచూ వేసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశంతో పాటు అనేక ఆనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. నెయిల్ పాలిష్ వేసుకునే సమయంలో కాస్తో.
కూస్తో అది చర్మానికి అంటుంది.ఇది సర్వ సాధారణం.
కానీ, దీని వల్లే అసలైన చిక్కు ఏర్పడుతుంది.

వాస్తవానికి నెయిల్ పాలిష్లలో ఎన్ని రంగులు, రకాలు ఉన్నప్పటికీ.అన్నిటిలోనూ ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ఉంటుంది.ఈ రసాయనం నెయిల్ పాలిష్ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడతారు.
అయితే ఎప్పుడైతే నెయిల్ పాలిష్ చర్మానికి అంటుకుంటుందో.అప్పులు అందులో ఉండే ట్రైఫెనైల్ ఫాస్పేట్ రసాయనం శరీరంలోని హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు అంటున్నారు.

అలాగే తరచూ నెయిల్ పాలిష్ వేసుకుంటే.శరీరంలో టీపీహెచ్‌పీ పెరిగి అధిర బరవుకు దారి తీస్తుంది.మరియు నెయిల్ పాలిష్ చర్మానికి క్రమంగా అట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్, రాషెస్rashes వచ్చే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి, అతిగా కాకుండా.నెయిల్ పాలిష్‌లను కూడా లిమిట్‌గా వాడండి.
అయితే ప్రెగ్నెంన్సీ మహిళలు మాత్రం అసలు వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు.ఎందుకంటే, నెయిల్ పాలిష్లలో ఉండే పలు కెమెకల్స్.
కడుపులోని బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపుతాయి.