రాజన్న సిరిసిల్ల జిల్లా : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం మూసి పరివాహక ప్రాంత హైడ్రా బాధితులకు అండగా వారిని పరామర్శించేందుకు వెళ్లేదారిలో కొంతమంది కాంగ్రెస్ గుండాలు కేటీఆర్ కాన్వాయ్ పైన దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుండాల రాజ్యాన్ని నియంతృత్వ పాలన చేస్తుందని,బడుగు బలహీన వర్గాల గొంతులను ఈ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవని అన్నారు.
పేద, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలవాల్సిన ఈ రాష్ట్ర ప్రభుత్వం రోడ్డుమీదికి తీసుకువచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులకు పాల్పడటం చాలా దురదృష్టకరమని, 20& 30 సంవత్సరాల క్రితం పర్మిషన్లు తీసుకుని మరి కట్టుకున్న ఇళ్లను ఈరోజు హైడ్రా పేరుతో కూల్చివేయడం సరికాదన్నారు.అప్పటి మీ కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే రిజిస్ట్రేషన్ చేసి పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు కూల్చివేయడం సరికాదని,వారికి అండగా వారికి మద్దతు ఇవ్వడానికి వెళ్లిన కేటీఆర్ కాన్వాయ్ పైన దాడి చేయడం చాలా అమానుషమని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పిడికిలి బిగించి మరి కొట్లాడిన వ్యక్తి కేటీఆర్ అని ఇలాంటి తాటాకు చప్పులకు భయపడే వ్యక్తి కాదని నికార్సైన తెలంగాణ పులిబిడ్డ అని ఈ కాంగ్రెస్ గుండాలు చేసిన దాడి కేటీఆర్ కి మరింత శక్తిని ఇస్తుందని అన్నారు.
కేటీఆర్ పైన దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్టు చేయాలని వారి పైన క్రిమినల్ కేసులు పెట్టాలని ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం అవుతే దాడికి ఎదురుదాడి తప్పదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ దాడి కి సంబందించి వెంటనే కేటీఆర్ కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక ఇలా డైవర్ట్ రాజకీయం చేస్తున్నారని , రాష్ట్రంలో ఇలాంటి దాడులతో బిఆర్ఎస్ నీ ఆపలేరని ప్రజలలో కేటీఆర్ మీద బిఆర్ఎస్ పైన వస్తున్న ఆదరణ ఓర్వలేకనే దాడులు చేపిస్తున్నారని ఆయన అన్నారు.
ఇప్పటికైన మీ దోరణి మార్చుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్, నాయకులు కోడి రోహిత్, అరవింద్,సాయి,రాజు, దేవరాజు,విష్ణు, అక్రం సమీ,వెంకటేష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.