యువీ క్రియేషన్స్ కి అచ్చొచ్చిన అనుష్క..ఐదేళ్లకు ఒకటి చొప్పున హ్యాట్రిక్

అనుష్క( Anushka ) తెలుగు సినిమా ఇండస్ట్రీకి జేజమ్మగా, అరుంధతిగా, బొమ్మాలిగా ఆమె స్థాయిని సుస్థిరం చేసుకుంది.అనుష్క నటిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ సినిమాలో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది అనే స్థాయిలో ఆమె తన స్టార్ డం ని పెంచుకుంటూ వెళ్ళింది.

 Anushka Truns Lucky Actress To Uv Creations , Uv Creations , Anushka, Miss Shett-TeluguStop.com

హీరోలకు దీటుగా పాన్ ఇండియా వ్యాప్తంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా దాదాపు దశాబ్దం పాటు ఏకచత్రాధిపత్యం చేసింది.కొన్నేళ్ల పాటు వెనక్కి చూస్తే అనుష్క లేని సినిమా లేదు అలా ఉండే పరిస్థితి జీరో సైజ్ సినిమా తర్వాత పూర్తిగా మారిపోయింది.

ఇక కొన్నేళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా కూడా ఉండాల్సి వచ్చింది జేజమ్మ.

Telugu Anushka, Tollywood, Uv-Telugu Stop Exclusive Top Stories

ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా( Miss Shetty is Mr.Polishetty’s movie ) హిట్ కావడంతో మరోమారు అనుష్క పేరు ఇండస్ట్రీ మొత్తం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.నవీన్ హీరోగా కామెడీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రం అభిమానులకు బాగా నచ్చింది.

ఇక అనుష్క నవీన్ నటించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్( UV Creations Banner ) పై తెరకెక్కడం విశేషం ఈ బ్యానర్ లో అనుష్క నటించిన మూడవ సినిమా కావడం కూడా మరొక విశేషం.అంతేకాదు ఐదేళ్లకొకసారి యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నటిస్తూ వచ్చిన అనుష్క ప్రస్తుతం హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకుంది.

Telugu Anushka, Tollywood, Uv-Telugu Stop Exclusive Top Stories

మొట్టమొదటిగా 2013లో ఈ బ్యానర్ పై మిర్చి అనే సినిమాలో అనుష్క నటించింది.ప్రభాస్, అనుష్క నటించిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది.ఆ తర్వాత దాదాపు 5 ఏళ్ల కు 2018 లో భాగమతి అనే సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది అనుష్క.ఇదే బ్యానర్ పై వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది.

మరోమారు ఇదే బ్యానర్ పై మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి రావడం హిట్టు కొట్టడం జరిగిపోయాయి.దాంతో యూవీ క్రియేషన్స్ కి ఐదేళ్ల ఒకసారి హిట్ ఇచ్చిన యాక్ట్రెస్ గా, పైగా మూడు చిత్రాలు హిట్టు కొట్టడంతో హ్యాట్రిక్ కూడా తన ఖాతాలో వేసుకుంది.

ఇలా ఈ బ్యానర్ కి అనుష్క బాగా కలిసి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube