రాజన్న సిరిసిల్ల జిల్లా: భారతదేశంలోని ప్రతి ఇండస్ట్రీకి ఐటిఐ విద్యార్థి చాలా అవసరమని రాజన్న సిరిసిల్ల జిల్లా శిక్షణ ఉపాధి కల్పన కన్వీనర్ డి కవిత అన్నారు ,దేశీయ పరిశ్రమల కోసం వివిధ ట్రేడ్‌లలో నైపుణ్యం కలిగిన కార్మికులను తయారుచేయడం, ఉపాధి శిక్షణను అందించడం ద్వారా చదువుకున్న యువతలో నిరుద్యోగాన్ని తగ్గించడం, క్రమబద్ధమైన శిక్షణ ద్వారా యువకుల మనస్సులలో సాంకేతిక, పారిశ్రామిక వైఖరిని పెంపొందించడం ఐటిఐ ల యొక్క ముఖ్య లక్ష్యాలుగా చెప్పవచ్చునన్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సాధు వెంకట్రెడ్డి ఐటిఐ శిక్షణ కేంద్రంలో మంగళవారం జరిగిన స్నానకోత్సవంలో ఐటిఐ లో రెండు సంవత్సరాల పాటు ఎలక్ట్రిషన్ లో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 80 మంది విద్యార్థులకు , డీజిల్ మెకానిక్ లో సంవత్సర కాలం పాటు శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 18 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా ఐటిఐ ప్రిన్సిపల్ సాదు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి 50 మందిని ఎంపిక చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని వీరికి అప్రెంటిస్ షిప్ లో పదిహేను వేల వేతనం కల్పిస్తారని ఆయన చెప్పారు.ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఐటిఐ కోర్సు చేయాలనుకుంటే కరీంనగర్,కామారెడ్డి,సిద్దిపేట పట్టణాలకు వెళ్ళవలసి ఉంటుండే అని ఆయన గుర్తు చేశారు.
ఐటిఐ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉన్నత చదువులు భవిష్యత్తు కూడా బాగుంటుండే నన్నారు.
బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వృత్తి విద్య కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని వృత్తి విద్య కోర్సుల వలన పదవ తరగతి తరువాత చిన్న వయసులోనే ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్లలో చిన్న వయసులోనే ఉద్యోగాలు స్కిల్ డెవలప్మెంట్ తో స్వయం పరిశ్రమలు నెలకొల్పుకోవచ్చునన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.కె సబేర బేగం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గౌస్ బాయి , వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి బాల్ రెడ్డి, నాయకులు శ్రీ పాల్రెడ్డి, గంట బుచ్చ గౌడ్ , మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.







