శాకుంతలం సినిమాకు( Sakunthalam movie ) ముందు నుంచి సమంత( Samantha ) కొన్ని అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంది.ఆమె సినిమా ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా లేదు.
ఇప్పటికే నాగ చైతన్య( Naga Chaitanya ) తో విడాకుల కారణంగా పెద్దగా సమంత విషయంలో పాజిటివ్ అంశాలు లేవు.

బోలెడంత నెగటివిటీ ని మూట గట్టుకున్న సమంత అనారోగ్యం పాలవ్వడం తో ఈ విషయంలో సానుభూతి పొందాలని తీవ్రంగా ప్రయత్నించింది. యశోద సినిమా ప్రమోషన్స్( Yashoda Movie Promotions ) టైం నుంచి ఈ అనారోగ్యం వార్త ఎల్లప్పుడూ ప్రధాన వార్తగా నడుస్తుంది.శాకుంతలం ట్రైలర్ విడుదల నుంచి సినిమా విడుదల వరకు ఒకటే విషయం.
దాంతో జనాల్లో ఉన్న కాస్త ఆ ఆసక్తి కూడా తగ్గిపోయింది.ప్రమోషన్స్ టైం లో మీడియా ముందు ఎన్ని సార్లు ముక్కు చీదినా ప్రయోజనం లేకపోయింది.

శాకుంతలం సినిమా మొదటి షో నుంచి నెగటివ్ టాక్ తో ముందుకు వెళ్తుంది.ఎన్ని రోజులు థియేటర్ లో ఉంటుంది అని చెప్పలేరు కానీ సమంత శాకుంతలం సినిమాలో మాత్రం ఒక రోగిష్టి గాన కనిపించింది.ఆమె పాత్రకు డబ్బింగ్ చెప్పిన విధానం కూడా ఎంతో బలహీనంగా ఉంది.మహా అందగత్తె అయినా శకుంతల పీలిక లాగ కనిపిస్తే స్క్రీన్ పై ఆమెను చూడాలన్న ఇంట్రెస్ట్ రావడం లేదు.
చాల రోజులుగా విమెన్ సెంట్రిక్ సినిమాల్లోనే కనిపిస్తున్న ఆమె యశోద తో పర్వాలేదు అనిపించుకున్న కూడా శాకుంతలం మాత్రం అతి పెద్ద మైనస్ గా ఆమె కెరీర్ లో నిలబడిపోతుంది.

ఖుషి ( Khushi )మరియు సిటాడెల్ ప్రాజెక్ట్స్( Citadel Projects ) తో ప్రస్తుతం సమంత బిజీ గా ఉంది.ముందు ముందు మంచి సినిమాలు తీయాలంటే సమంత తన అనారోగ్యం నుంచి కోలుకోవాలి.లేదంటే ఇలాగే సినిమా సినిమాకు ముక్కు చీదుతూ జనాలను ఇబ్బంది పెడుతూ తన అనారోగ్యం కూడా లెక్క చేయకుండా సినిమా తీశానని చెప్తూ వెళాల్సి ఉంటుంది.

ఇదే ఎక్కువ రోజులు చెప్తే మాత్రం జనాలు వింటారా అంటే అది ప్రశ్నార్ధకమే.దమ్మున్న సినిమాలు మాత్రమే చేస్తే చిన్న చిన్న ప్రొబ్లెమ్స్ ని ఎవరు పెద్దగా పట్టించుకోరు.కానీ ప్రతి సారి ఒక సాకును చూపెట్టి జనాలను థియేటర్ కి తీసుకరాలేవు సమంత .