చెన్నై సూపర్ కింగ్స్ – రాజస్థాన్ రాయల్స్( CSK vs RR ) మధ్య జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ రూల్స్ ఉల్లంఘించినందుకు రవిచంద్రన్ అశ్విన్ పై( Ravichandran Ashwin ) ఆ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు.మ్యాచ్ లో మంచు కారణంగా అంపైర్ బంతిని మార్చాడు.
అయితే అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించిన కారణంగా రవిచంద్రన్ అశ్విన్ పై జరిమానా పడింది.ఈ విషయాన్ని ఐపీఎల్ విడుదల చేసిన పత్రికలో పేర్కొంది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.చెన్నై జట్టు( CSK ) లక్ష్య చేదనలో మూడు పరుగుల తేడాతో ఓడింది.
దీంతో రాజస్థాన్ జట్టు మూడవ విజయం సాధించి లీగ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత తనపై విధించిన జరిమానా గురించి అశ్విన్ స్పందిస్తూ.అంపైర్ బంతిని మార్చాలన్న నిబంధన మ్యాచ్ ఫలితాలలో మార్పులు తేవచ్చు, తేకపోవచ్చు.తమ జట్టు బౌలింగ్ చేస్తున్న సందర్భంలో తాము బంతిని మార్చమని అంపైర్ ని అడగలేదు.
కానీ అంపైర్ బంతిని మార్చినప్పుడు దీనికి కారణం ఏమిటని అడగడంతో అలా బంతిని మార్చే అధికారం తమకు ఉందని అంపైర్లు చెప్పారని తెలిపాడు.

ఈ నిర్ణయం తమ జట్టుకు అనుకూలమే అయినా.అంపైర్లు బంతిని మార్చడం తనకు నచ్చలేదని తెలిపాడు.దీనితో తనపై జరిమానా విధించబడిందని తెలిపాడు.
కాగా ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన అశ్విన్ 22 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లతో 30 పరుగులు చేశాడు.ఇక బౌలింగ్ విషయానికి వస్తే నాలుగు ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
దీంతో రవిచంద్రన్ అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.







