పైనాపిల్.దీనిని అనాస పండు అని కూడా పిలుస్తారు.
పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండే పైనాపిల్‌లో విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ ఎ, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, మాంగనీస్, కెరోటిన్, ప్రోటీన్, ఫైబర్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా పైనాపిల్ ఎంతో మేలు చేస్తుంది.
కానీ, చాలా మంది పైనాపిల్‌ను డైరెక్ట్‌గా తినడానికి ఇష్టపడరు.అయితే ఇప్పుడు చెప్పబోయే విధంగా పైనాపిల్‌ను తీసుకుంటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు.
మరి ఇంకెందుకు ఆలస్యం అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం పదండీ.

ముందుగా పండిన ఒక పైనాపిల్‌ను తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్‌లో పైనాపిల్ ముక్కలు వేసి గ్లాస్ వాటర్ పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్ నుంచి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత హాఫ్ గ్లాస్ పైనాపిల్ జ్యూస్‌లో, హాఫ్ గ్లాస్ చెరుకు రసం, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని సేవించాలి.
ఈ విధంగా పైనాపిల్‌ను తరచూ తీసుకుంటే గనుక జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది.
గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.అలాగే పైనాపిల్ జ్యూస్‌లో చెరుకు రసం కలిపి తీసుకోవడం వల్ల కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్య వంతంగా మారతాయి.
వెయిట్ లాస్ అవుతారు.

హెయిర్ ఫాల్ సమస్యతో బాధ పడేవారు పైన చెప్పిన విధంగా పైనాపిల్‌ను తీసుకుంటే జుట్టు రాలడం, చిట్లడం, విరగడం వంటి సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు.పైనాపిల్ రాసానికి చెరుకు రసం యాడ్ చేసి తాగడం వల్ల నీరసం, అలసట వంటివి తగ్గు ముఖం పడతాయి.శరీరం క్షణాల్లో శక్తివంతంగా మారుతుంది.
కంటి చూపు పెరుగుతుంది.మరియు నోటి దుర్వాసన సమస్య సైతం దూరం అవుతుంది.







