మనసుకు ఎంతో దగ్గరైన లైఫ్ పార్ట్నర్ లేదా లవర్ చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం.బిల్లీ లెబ్లాంక్( Billy LeBlanc ) అనే యువకుడు అలాంటి బాధనే అనుభవిస్తున్నాడు.
ఈయన నటాలీ క్లార్క్( Natalie Clark ) అనే అమ్మాయిని ఎంతో ప్రేమించాడు వీరిద్దరూ ప్రేమ పక్షులు లాగా ఎన్నో రోజులు గడిపారు అయితే నటాలీ వైబ్రియో వల్నిఫికస్( Vibrio Vulnificus ) అనే బ్యాక్టీరియా కారణంగా అంటువ్యాధి బారిన పడింది.అది నయం కాలేదు సరి కదా ఆమె ప్రాణాలను బలి తీసుకుంది.
వీళ్లు పచ్చి గుల్లలు తిన్న తర్వాత ఈ ఇన్ఫెక్షన్కు గురయ్యారు అతను కూడా అస్వస్థత బారిన పడ్డాడు కానీ అతను ఎలా ఈ వ్యాధిని చేయించాడు కానీ ఆమె మరణించింది.బిల్లీ ఆ చేదు నిజాన్ని జులైలో తెలియజేశాడు.
బిల్లీ లెబ్లాంక్ “బ్రటేలీ” ( Bratayley ) అనే ఓ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానెల్ వీడియోలో బాగా కనిపిస్తుంటాడు.ఆ ఛానెల్ ద్వారానే ఫేమస్ అయ్యాడు.
![Telugu Billy Leblanc, Latest, Natalie Clark, Nri, Podcast, Rare, Youtuber, Youtu Telugu Billy Leblanc, Latest, Natalie Clark, Nri, Podcast, Rare, Youtuber, Youtu](https://telugustop.com/wp-content/uploads/2024/11/After-Losing-His-Girlfriend-Due-To-Rare-Infection-Man-Fulfills-Her-Dream-viral-detailsd.jpg)
ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో బిల్లీ తన విచారాన్ని వ్యక్తం చేశాడు.తనకూ నటాలీకి సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంటూ, తాము కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నాడు.“నేను కూడా చాలా అస్వస్థతకు గురై 12 రోజులు ఆస్పత్రిలో ఉన్నాను.దురదృష్టవశాత్తు, నటాలీ బతికిరాలేదు.మేం కలిసి ఎలా ఎంజాయ్ చేశామనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను.“జాగ్రత్తగా ఉండండి, మీ ప్రియమైన వారిని గట్టిగా హత్తుకుని ఉండండి, ఎప్పుడు వారిని చివరిసారిగా చూస్తారో తెలియదు” అని రాశాడు.
![Telugu Billy Leblanc, Latest, Natalie Clark, Nri, Podcast, Rare, Youtuber, Youtu Telugu Billy Leblanc, Latest, Natalie Clark, Nri, Podcast, Rare, Youtuber, Youtu](https://telugustop.com/wp-content/uploads/2024/11/After-Losing-His-Girlfriend-Due-To-Rare-Infection-Man-Fulfills-Her-Dream-viral-detailsa.jpg)
బిల్లీ లెబ్లాంక్ తన ప్రియురాలు నటాలీ మరణించిన విషయాన్ని నిర్ధారించాడు.“మేం ఎక్కడికి వెళ్లినా కలిసి పోతూ ఉండేవాళ్లం” అని చెప్పడం ద్వారా తన శాశ్వత ప్రేమను వ్యక్తం చేశాడు.ఆయన మాటలు చాలామందిని తాకాయి.కొన్ని నెలల తర్వాత, బిల్లీ నటాలీ కలలు నెరవేర్చడానికి సిద్ధమయ్యాడు.లేటెస్ట్ యూట్యూబ్ వీడియోలో, నటాలీ కలల్లో ఒకటైన పాడ్‌కాస్ట్‌ను( Podcast ) ప్రారంభించానని వెల్లడించాడు.“నటాలీ ఎప్పుడూ నేను పాడ్‌కాస్ట్ చేయాలని కోరుకుంది” అని చెప్పారు.
తద్వారా తన ఫాలోవర్లను పాడ్‌కాస్ట్ జర్నీలో చేరమని ఆహ్వానించాడు.పాడ్‌కాస్ట్ ఎట్టకేలకు ప్రారంభించి ఆమె కలను నెరవేర్చాడు.
వీడియోలో, నటాలీ ఓల్డ్ నోట్‌బుక్‌లో కనుగొన్న కొన్ని ప్రశ్నలకు కూడా బిల్లీ సమాధానమిచ్చాడు.వాటిలో “నా వైపు నీకు ఎందుకు ఆకర్షణ ఏర్పడింది?”, “నీవు నిరంతరం యూట్యూబ్ వీడియోలు ఎందుకు తీయవు?” వంటి వ్యక్తిగత ప్రశ్నలు కూడా ఉన్నాయి.అయితే అతని ఫాలోవర్లు పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించడానికి సలహాలు ఇస్తూ, ప్రోత్సాహకరమైన సందేశాలు పంపారు.