మోసపూరితమైన యాప్ లలో అత్యాశకు పోయి డబ్బులు పెట్టి మోసపోవద్దు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: మోసపూరితమైన యాప్ లలో అత్యాశకు పోయి డబ్బులు పెట్టి మోసపోవద్దు.సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

 Dont Get Greedy And Get Cheated By Putting Money In Fraudulent Apps, Cheated ,-TeluguStop.com

సైబర్ నేరాలకు గురైతే వెంటనే ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 తో పాటు, www.cybercrime.gov.in వెబ్ సైట్ లో పిర్యాదు చేయవచ్చు.జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… ఆన్-లైన్ & మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని,తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు అంటూ మోసపూరిత ప్రచారాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ఈజీ మనీ ఆశలో పడి మోసపోవద్దన్నారు.

కొన్ని గంటల్లో, ఒక రోజులోనే, వారం రోజుల్లోనే రెట్టింపు నగదు ఇస్తానంటూ,ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటు,ఆశావహులకు యెర వేస్తున్నారని,ఆన్లైన్ ట్రేడింగ్, గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో అమాయక ప్రజలకు కుచ్చుటోపీ పెడుతున్నారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

స్టూడెంట్స్, రిటైర్డ్ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ ఆకట్టుకునే ప్రకటనలతో నమ్మిస్తూ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఏడాదికే రెట్టింపు అవుతుందని, తమ కంపెనీ మెంబర్ గా జాయిన్ అయ్యి వాటిని అమితే లక్షలు సంపాదించుకోవచ్చని మాయమాటలు చెప్తారు.

ప్రొడక్ట్స్ తో పాటు ఎడ్యుకేషన్ కు సంబంధించిన మల్టీ లెవల్ మార్కెటింగ్ సెమినార్లు పెట్టి లక్షలాది మందిని బురిడీ కొట్టిస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు కొన్ని వాట్సప్ ప్ గ్రూపులు క్రియేట్ చేసి అందులో మిమ్మల్ని ఆడ్ చేసి ఆ గ్రూప్ లో ఉన్న మిగతా సభ్యులు వారు చాలా డబ్బులు గెలుచుకున్నట్లుగా మెసేజ్ లు స్క్రీన్ షాట్ లు పెడుతూ ఉంటారు, అది చూసిన బాధితులు కూడా నిజమని నమ్మి అత్యాశకు పోయి కంపెనీలలో పెట్టుబడి పెట్టి మోసపోతారు.

ఆన్లైన్ మార్కెటింగ్ యాప్ ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

*చైన్ మార్కెటింగ్(గొలుసుకట్టు) మోసాలు ,ఏదైనా కంపెనీ పేరుతో ముందుగా మీరు కొంత డబ్బు కట్టి జాయిన్ అవ్వండి ఆ తరువాత అందులో మరో ముగ్గురిని జాయిన్ చేయిస్తే మీకు లైఫ్ లాంగ్ income ఉంటుంది అని చెప్పి మోసం చేస్తారు.
*Eli&lilly అనే యాప్ లో ఇన్వెస్ట్ చేస్తే ఒక రోజులోనే అమౌంట్ రెట్టింపు అవుతాయని నమ్మించి ఇన్వెస్ట్మెంట్ చేపించారు.అలా వాళ్ళ ప్రమోట్ చేస్తు ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందంటూ నమ్మిస్తారు.
*Wwake అనే యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అమౌంట్ త్వరగా రెట్టింపు అవుతాయని అలాగే దాన్ని ప్రమోట్ చేస్తూ వాట్సాప్ గ్రూప్ లో వలన నమ్మించి చాలామంది చేత ఇన్వెస్ట్మెంట్ చేపించారు తర్వాత యాప్ ని ఎత్తేస్తారు.
*Viyaka స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఈ యాప్ లో ట్రేడింగ్ చేయొచ్చు అంటూ ఇన్వెస్ట్ చేపించి తర్వాత విత్ డ్రా కు అవకాశం ఇవ్వకుండా మోసం చేయడం జరుగుతుంది.
*గ్రోమో యాప్ నీ ప్రమోట్ చేయడం ద్వారా అలాగే అందులో ఇన్వెస్ట్ చేయండి అని ప్రమోట్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించ వచ్చని ప్రమోట్ చేయడం ద్వారా మోసం చేయడం జరుగుతుంది.
*మోసపూరితమైన CRYPTO CURRENCY, ONLINE TRADING AND ONLINE MULTI LEVEL MARKETING COMPANIES లో అత్యాశ కు పోయి డబ్బులు పెట్టి మోసపోవద్దు.
*Online Trading/Investments/Crypto Currency/ wallets/ Multi Level Marketing Schemes app లను డౌన్ లోడ్ చేయకండి మరియు మీ డబ్బులు పెట్టుబడిగా పెట్టి మోసపోకండి.
*సైబర్ నేరగాళ్లు WhatsApp లేదా telegram ద్వారా ఏ ఆప్ నైనా డౌన్ లోడ్ చేసుకోమని చెప్తే చేసుకోకండి మరియు ఆ వెబ్ సైటు ని నమ్మవద్దు,ఇదంతా మోసం అని గ్రహించండి.
*సోషల్ మీడియాలో మోసపూరిత ప్రకటనలు చూసి మీరు కొన్నిసంవత్సరాలు కష్ట పడిన సొమ్ముని అనాలోచితంగా అత్యాశకు పోయి గుర్తు తెలియని App లలో పెట్టుబడి పెట్టి మీ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసుకోకండి.
*సైబర్ నెరగాళ్లు పేర్కొన్న Investment App లను డౌన్ లోడ్ చేసుకోమని చెప్పి మీతో డబ్బు పెట్టుబడి పెట్టించి మోసం చేస్తారు జాగ్రత్త.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube