రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బిజెపి అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ మండల ఇన్చార్జిలు శరత్ రెడ్డి, పరశురాములు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉమ్మడి కరీంనగర్ – నిజామాబాద్ – అదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ బిజెపి బలపరచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సి.అంజి రెడ్డి,టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమురయ్య ని గెలిపించడానికి చేపట్టవలసిన కార్యక్రమాలను గురించి వివరించారు.
కార్యకర్తలతో పట్టభద్రుల అభ్యర్థి అంజి రెడ్డి కి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య కిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించేలా కార్యాచరణ రూపుదిద్దుకోవాలని , కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మద్దుల బుగ్గారెడ్డి,కోనేటి సాయిలు, నంది నరేష్,బంధారపు లక్ష్మారెడ్డి, కృష్ణ హరి,ప్రదీప్ రెడ్డి, కిరణ్ నాయక్,రవి నాయక్, బొమ్మాడి స్వామి, వంగల రాజు, మేడిశెట్టి లక్ష్మణ్, శ్రీశైలం ప్రకాష్, ప్రశాంత్, బాలయ్య, రేపాక రామచంద్ర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చందుపట్ల రామ్ రెడ్డి, సత్యం రెడ్డి,ఎలేందర్,మహేష్ బాబు, బాలా గౌడ్,దయాకర్,కిషన్ రెడ్డి,శ్రీనివాస్,రవి,వేణు రెడ్డి, మల్లయ్య,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







