సజావుగా అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు - సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.సోమవారం న్యూ ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ,సన్నద్ధతపై నిర్వహించిన వీడియో సమావేశంలో హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారు లతో కలిసి పాల్గొనగా, సమీకృత జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, డీస్పీ లు , నోడల్ అధికారులతో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

 Strict Measures For Smooth Conduct Of Assembly Elections Senior Deputy Election-TeluguStop.com

సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ మాట్లాడుతూ, నామినేషన్ల స్వీకరణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని, రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ సమయంలో సమయపాలన పాటించాలని అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి తప్పనిసరిగా ఓటరు జాబితా వివరాలు అందించాలని, స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

అభ్యర్థుల సమక్షంలో ఈవీఎం యంత్రాల రెండవ ర్యాండమైజేషన్ చేపట్టాలని , అభ్యర్థులు అధికంగా ఉంటే సప్లిమెంటరీ ర్యాండమైజేషన్ చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు.పెండింగ్ ఓటర్ నమోదు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

పోలింగ్ సక్రమంగా జరిగేందుకు ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని, ఈవిఎం యంత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలని అన్నారు.ఈవీఎం యంత్రాలు తరలించే అధికారులకు అవసరమైన భద్రత కల్పించాలని అన్నారు.

పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల జాబితా అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు అందజేయాలని, పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మోడల్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, పోలింగ్ కేంద్రాలలో దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని అన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు జాబితా సిద్ధం చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు, అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని అన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలు తప్పకుండా అమలు చేయాలని, సి విజల్ యాప్ ను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు.

మీడియా సెంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల రికార్డులకు సంబంధించి ప్రతి అంశం భద్రపరచాలని అన్నారు.రాజకీయ పార్టీలకు , అభ్యర్థులకు అవసరమయ్యే వివిధ రకాల అనుమతులను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన నిష్పక్షపాతంగా అందించాలని అన్నారు.

ఎన్నికల తనిఖీలలో భాగంగా నగదు జప్తు చేసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కమిటీ ప్రతి రోజు వచ్చే అప్పీల్ పై చర్చించి నిర్ణయం తీసుకోవాలని, 10 లక్షల కంటే అధికంగా నగదు జప్తు చేసిన సమయంలో ఐటి అధికారులకు సమాచారం అందించాలని అన్నారు.నవంబర్ 3 నుంచి ఎన్నికల పరిశీలకుల క్షేత్రస్థాయి పర్యటన ఉంటుందని సన్నద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.

ఎన్నికల్లో పార్టీలు,అభ్యర్థులు ఖర్చు చేసే ప్రతి పైసా ను లెక్కించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులకు ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశనం చేశారు.

ఎన్నికల్లో పార్టీలు అభ్యర్థులు చేసే ప్రతి పైసాను లెక్కించాలన్నారు.వ్యయ లెక్కింపు బృందాలకు మరోసారి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అన్ని పోలింగ్ కేంద్రాలలో అస్సుర్డ్ మినిమం ఫెసిలిటీస్ కల్పించాలన్నారు.ఓటు నమోదు కోసం వచ్చిన అన్ని పారాలను క్లియర్ చేయాలన్నారు.

అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులు భారత ఎన్నికల సంఘం నియమ నిబంధనలను పాటించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube