పవర్ లూమ్ లకు 10 హెచ్ పీ వరకు పవర్ సబ్సిడీ సెస్ పరిపాలక సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి

సిరిసిల్లా జిల్లా లోని సెస్ పరిధిలోని పవర్ లూమ్( Power loom ) ల యజమానులు తమ పవర్ లూమ్స్ నకు ఒకటి కన్నా ఎక్కువ సర్వీస్ కనెక్షన్ (మీటర్) లు కలిగియుండి అందులో నుండి ఒకటి లేదా రెండు సర్విస్ కనెక్షన్లు (మీటర్లు) పవర్ లూమ్స్ నకు వాడుకొని మిగిలిన వాటిని తిరిగి సంస్థకు వాపసు చేయాలని సెస్ పరిపాలక సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి ( Srinivas Reddy )ఒక ప్రకటన లో తెలిపారు.వాపసు చేసే సర్విస్ కనెక్షన్లపై ప్రస్తుతం బకాయి రూ.

 Power Subsidy Cess Up To 10 Hp For Power Looms Administrative Director Srinivas-TeluguStop.com

లు చెల్లించి వాటిని సరెండర్ చేసుకోవచ్చని వివరించారు.ఒక్కో వాటిపై కేటగిరి మార్పు వల్ల బ్యాక్ బిల్లింగ్ ఏమైనా వుంటే అట్టి బకాయిల పై తమ అధీనంలో వుంచుటకు సర్వీస్ కనెక్షన్ పైకి మార్చి తాత్కాలికంగా బకాయి చూపిస్తామని స్పష్టం చేశారు.

బకాయిల పై తర్వాత ఏ నిర్ణయం తీసుకున్నా అట్టి నిర్ణయం సెస్ సంస్థ వినియోగదారులు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇక పై సర్వీస్ కనెక్షన్ వాడుకోబడని మీటర్ల పై తదుపరి బిల్లు రాకుండా, ప్రస్తుతం మిగిలిన సర్వీస్ కనెక్షన్ 10 ఎచ్ పి( Service connection 10 HP ) లోపల వాడుకున్నట్లయితే సబ్సిడి కి అర్హులుగా ఉండడం కోసం చేనేత కార్మికులకు లాభము అయ్యేలా ఉండడం కోసం ఈ నిర్ణయం పాలక వర్గం చేసిందని తెలిపారు.

ఈ అవకాశాన్ని వినియోగించుకునే వారు సంబంధిత టౌన్ 1, 2, ఏ.ఏ.ఈ.లు, ఏ.ఏ.ఓలను సంప్రదించాలని పరిపాలక సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube