ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ…వేములవాడ పట్టణానికి చెందిన వోటకరి భూమేష్ అనే వ్యక్తి వేములవాడ పట్టణం ( Vemulawada town )గాంధీ నగర్ లో ఉంటున్న సాంధారికారి వీణ w/o దరిష్ అనే వారి యెక్క జగిత్యాల జిల్లా కేంద్రంలోని మొచి వాడాలో ఉన్న సంధారికరి వీణ యెక్క అత్తగారి పెరు మీద ఉన్న ఇల్లు అమ్మడానికి ప్రయత్నిస్తున్నపుడు వొటారికారి భూమేష్ అనే వ్యకి వీణ కు మాయమాటలు చెప్పి అతని మామా పేరున ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు.
తరువాత ఆ ఇంటిని వేరే వ్యక్తి కి 45 లక్షలకు అమ్మివేసాడు.
సాంధారికారి వీణ కి కాని ఆ ఇల్లు స్వంతదారులకి గాని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకి గురించి చేసాడు.వీణ కుటుంబ సభ్యులు చాలా సార్లు భూమేష్ ని అడగగా 20 లక్షలు ఇచ్చాడు.
మిగతావి ఇవ్వాలంటే 2 లక్షలు ఇవ్వాలని ఇస్తే మిగితా డబ్బులు ఇస్తా అని డిమాండ్ చేస్తే వారు ఇచ్చారు.కాని మరల 3 లక్షలు ఇవ్వాలని లేకుంటే తమ కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాగా వీణ పిర్యాదు మేరకు వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వోటకరి భూమేష్ ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని ఏఎస్పీ తెలిపారు.
వోటకరి భూమేష్ చేతిలో మోసపోయిన బాధితులు కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ పరిధిలో ఉన్నారని వారి నేరుగా మీ సబంధిత పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేస్తే వోటకరి భూమేష్ పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏఎస్పీ తెలిపారు.







