రాజన్న సిరిసిల్ల జిల్లా ఆదివారం ఉదయం సిరిసిల్ల పట్టణములోని హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సమీపంలో ఒక యువకుడు పిడ్స్ వచ్చి పడిపోయి అపస్మారక స్థితికి లో పడి పోయాడు.అటు వైపుగా ఉదయం వాకింగ్, జాగింగ్ చేసుకుంటూ వెళ్తున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గమనించారు.
వెంటనే స్పందించిన ఎస్ పి తన సిబ్బందితో యువకుని వద్దకు చేరుకొని ప్రథమ చికిత్స అందించి యువకుడిని కాపాడారు.ఆపదలో ఉన్న యువకుడికి కాపాడి మానవత్వం చాటుకున్నారు ఎస్పీ అఖిల్ మహాజన్.
ఈ సంఘటన చూసిన, తెలుసుకున్న పలువురు ఎస్పీ అఖిల్ మహాజన్ ను అభినందించారు.







