అనుమానిత లావాదేవిల పై సమాచారం ఇవ్వండి

బ్యాంకు అధికారులను కోరిన జిల్లా ఎన్నికల అధికారిసాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి.రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎన్నికల కోడ్ లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla )లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అనుమానిత నగదు లావాదేవీలపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి( Anurag Jayanti ) బ్యాంక్ అధికారులకు సూచించారు.ఖాతాల్లో భారీగా నగదు జమ, విత్ డ్రాల సమాచారాన్ని ఎన్నికల అకౌంటింగ్ నోడల్ ఆఫీసర్ రోజువారీ నివేదిక అందజేయాలని అన్నారు.గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ మీటింగ్ హల్ లో జిల్లాలోని అన్ని బ్యాంకుల కో ఆర్డినేటర్ లతో సమావేశం నిర్వహించారు.

 Provide Information On Suspicious Transactions , Rajanna Sirisilla , Anurag Jay-TeluguStop.com

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోజిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున బ్యాంకుల్లో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అనుమానిత, లెక్కకు మించిన నగదు ఖాతాలపై నిఘా ఉంచి వారి సమాచారాన్ని ప్రతిరోజూ పంపించాలని సూచించారు.ఏటీఎంలలో నగదు డిపాజిట్ చేయడానికి వినియోగించే వాహనాలకు ఆయా బ్యాంకులు తప్పనిసరిగా జీపీఎస్ ను ఏర్పాటు చేసి, వాహనాలను పరిశీలించాలని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, బ్యాంకు అధికారులు తరలిస్తున్న నగదుకు తప్పనిసరిగా డాక్యుమెంట్లు, క్యూఆర్ కోడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

అభ్యర్థి, అభ్యర్థి సంబంధీకుల అకౌంట్ల నగదు లావాదేవీలను అందించాలని తెలిపారు.ఎవరైనా బ్యాంకు ఖాతాలో( Bank account ) ప్రతీ రోజు లక్ష రూపాయలు డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా, నెలలో రూ.10 లక్షలు పైబడి నగదు డ్రా చేసినా, బదిలీ చేసినా ప్రతీ రోజు ఆయా బ్యాంకుల అధికారులు ఎన్నికల అధికారులకు సమాచారం అందించాలని సూచిం చారు.ఆన్లైన్లో జరిగే లావాదేవీలపై గట్టి నిఘా పెట్టాలని కోరారు.ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు ఒకే అకౌంట్ , వివిధ అకౌంట్లకు యూపీఐ ద్వారా గూగుల్ పే, ఫోన్ పే ఇతర యాప్ ద్వారా డబ్బులు జమ చేసినచో వాటి వివ రాలను కూడా పంపించాలని బ్యాంకర్లను ఆదేశిం చారు.రూ.10 లక్షల నుంచి లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కు సమాచారం అందించాలని చెప్పారు.బ్యాంక్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు వ్యవహరించాలని చెప్పారు.సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా లీడ్ బ్యాంక్ అధికారి టిఎన్ మల్లికార్జున్ రావు, ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి రామకృష్ణ ,జిల్లా ఎడిట్ అధికారిని స్వప్న, ఐటీ నోడల్ అధికారి మహమ్మద్ రఫీ, జిల్లాలోని అన్ని బ్యాంకు ల కో ఆర్డినేటర్ లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube