అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన తప్పనిసరి - కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : అగ్ని ప్రమాదాల నివారణపై ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు.ఈ నెల 14 నుంచి 20వ తేదీ దాకా అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా ఆ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల సముదయంలోని తన ఛాంబర్లో కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఆవిష్కరించారు.

 Awareness Of Fire Prevention Is A Must - Collector Anurag Jayanthi, Awareness ,f-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడారు.

జిల్లాలోని షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా హాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, గోడౌన్, పరిశ్రమలు,ఆలయాల్లో మంటలు ఆర్పివేసే పరికరాల వినియోగంపై ఆయా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి వివరించాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

అగ్ని ప్రమాదాల నివారణ యంత్రాలను పరిశీలించాలని సూచించారు.అగ్ని ప్రమాదాల నివారణపై అందరికీ అవగాహన కల్పించేందుకు పోస్టర్లు రూపొందించి, కార్యక్రమాలు చేపడుతున్న అగ్నిమాపక శాఖ అధికారులను కలెక్టర్ అభినందించారు.

కార్యక్రమంలో జిల్లా అగ్ని మాపక శాఖ అధికారి వెంకన్న, సిరిసిల్ల, వేములవాడ ఫైర్ ఆఫీసర్లు నరసింహచారి, కమలాకర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube