వీడియో వైరల్.. చూస్తుండగానే ఘోరం.. బీచ్‌లో ఇల్లు..?

మామూలుగా మనం సాగర తీరాన ఇల్లు కడితే ఎంత బాగుంటుందో తెలుసు కదా.ప్రకృతిని ఆస్వాదిస్తూ.

 Beach House While Watching The Video Viral, A Rodanthe, Nc House ,was Consumed-TeluguStop.com

జీవించవచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు.అయితే ఒక్కోసారి సాగర తీరాన ఇల్లు కడితే అలల తాకిడికి నిర్మాణాలు బలహీనపడి నేలమట్టం అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

ఇక ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని నార్త్ కరోలినాలో( North Carolina, USA ) సముద్ర తీరాన అనుకోని కొన్ని భవనాలు నిర్మించడం జరిగింది.వాస్తవానికి ఈ భవనాలు నిర్మాణ ( Construction of buildings )సమయంలో తీరానికి కాస్త దూరంగానే కట్టారు.

అయితే వాతావరణం మార్పు వలన భూమి వేడెక్కి సముద్రమట్టాలు పెరగడంతో తీరం కాస్త ఈ భవనాల వద్దకు చేరాయి.

ఈ క్రమంలో ఆ అలల తాకిడికి అక్కడి నిర్మాణాలు బలహీనపడి ఒక్కొక్క భవనం కుప్పకూలడం మొదలయ్యాయి.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.సముద్రంలో ఉన్న రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడం మనం వీడియోలో చూడవచ్చు.

అయితే అలల తాకిడిని తట్టుకోలేకపోవడమే భవనం నెమ్మదిగా ఒరిగి చివరికి కుప్పకూలిపోయింది.ఇలా కుప్పకూలిపోవడం లైవ్ లో చూసినవారు అందరూ కూడా గట్టిగా అరవడం మొదలుపెట్టారు.

ఇలా కుప్పకూలిన భవనం సముద్రపు నీటిలో తేలాడుతూ అలాగే లోపలికి వెళ్ళిపోయింది.అయితే ఇలా భవనాలు( Buildings ) కుప్పకూలడం మొదటి సారి ఏమీ కాదట.

ఇప్పటికే ఆరు నిర్మాణాలు ఇలా సముద్రం మింగేసిందని అక్కడివారు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం మాత్రం సముద్రంలో భవనం నేలమట్టం అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా మరోవైపు ఏది ఏమైనా కానీ సముద్రతీరాన ఇలా ఇల్లు కట్టుకోవడం జీవించడం కాస్త ప్రమాదకరమనే చెప్పుకోవాలి.ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోయారు కాబట్టి సరిపోయింది .కానీ ఒకవేళ ఎవరైనా ఆ ఇంట్లో నివసించి ఉంటే ఎంత ఘోరము జరిగిపోయేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube