సినిమా షూటింగ్స్ చాలా కచ్చితమైన షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి.ఒక్క రోజు ఆలసమైనా చాలా నష్టం వస్తుంది.
అందుకే హీరోలు షూటింగ్ అనుకున్న ప్రకారమే జరగాలని చూస్తారు.నటన అంటే కూడా హీరోలకు చాలా ఇష్టం కాబట్టి, తమ పాత్ర కోసం ఎంత కష్టమైనా పడతారు.
అనారోగ్యంగా ఉన్నా కూడా సినిమాకు వెళ్లి నటించాలని భావిస్తారు.ఎందుకంటే, తాము ఎంత బాధ్యత గల వారో చూపించాలని అనుకుంటారు.
మాములుగా ఒక సినిమా షూటింగ్‌లో చాలా మంది పని చేస్తుంటారు.హీరో లేదా హీరోయిన్ అనారోగ్యంతో లీవ్ తీసుకుంటే అందరి పని ఆగిపోతుంది.అందుకే అనారోగ్యంగా ఉన్నా సినిమాకు వెళ్లి నటించాలని భావిస్తారు.అలాంటి డెడికేటెడ్ టాలీవుడ్ సెలబ్రిటీలు ముగ్గురు ఉన్నారు.
వీళ్లు తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా సరే షూటింగ్ సెట్స్‌కి వచ్చి తమ సీన్లు కంప్లీట్ చేశారు.వారెవరో తెలుసుకుందాం.
• చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) చాలా డెడికేటెడ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు.ఆయన చేస్తున్న డ్యాన్స్‌లు, ఫైట్లు చూస్తుంటే ఈ హీరో ఎంతగా కష్టపడతాడో అర్థం అవుతుంది.ఆ కృషి వల్లే చాలా చిన్న యాక్టర్ నుంచి టాలీవుడ్ నంబర్.1 హీరో స్థాయికి ఎదిగాడు.ఈ నటుడు ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్‌లో పాల్గొంటాడు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని( Jagadeka Veeru Atiloka Sundari movie ) ‘ధీనక్కుట’ అనే ఒక పాట ఉంటుంది.
ఇందులో చిరు చాలా ఎనర్జిటిక్ డాన్స్ చేశారు.కానీ నిజానికి ఆ సమయంలో ఆయనకు 104 డిగ్రీల ఫీవర్ ఉందట.అయినా సరే దాని లెక్క చేయకుండా ఆయన ఈ సాంగ్ షూట్ కంప్లీట్ చేసి తన డెడికేషన్ ఎలా ఉంటుందో చూపించాడు.

• శ్రీలీల
యంగ్ హీరోయిన్ శ్రీలీల ( Srilila )ధమాకా మూవీ తర్వాత పదుల సంఖ్యలో ఆఫర్లు దక్కించుకుంది.ఆ హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆమె ఒప్పుకుంది.అన్ని మూవీస్ లో ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది.
ఒకానొక సమయంలో తీవ్రమైన జ్వరం కూడా వచ్చింది.ముఖ్యంగా “ఆదికేశవ” సినిమా( “Adikesava” movie ) షూటింగ్ సమయంలో ఆమె ఫీవర్ ఎక్కువైంది.
అయినా సరే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొని తన ప్రొఫెషనలిజం చూపించింది.

• నితిన్
( Nitin )
“లై” మూవీ సినిమా( “Lie” movie ) ఫారిన్ కంట్రీలో షూట్ చేస్తున్నప్పుడు నితిన్ కి హై ఫీవర్ వచ్చింది.అయినా సరే అతను ఈ మూవీ చిత్రీకరణలో పార్టిసిపేట్ చేశాడు.అంతేకాదు కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాడు.
సినిమా త్వరగా అయిపోవాలనే తన అనారోగ్యాన్ని పట్టించుకోకుండా యాక్ట్ చేశాడు.