దేవర మూవీ గురించి అదిరిపోయే అప్ డేట్.. అప్పటినుంచే షోలు మొదలవుతాయా?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర( Devara ) సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నాడు.

 Nr Ntr Devara Movie Mid Night Shows, Jr Ntr, Devara Movie, Mid Night Shows, Toll-TeluguStop.com

ఈ పాన్ ఇండియా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెల కొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో దేవర చిత్రం సిద్ధమవుతోంది.కొరటాల తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్స్ ఈ మూవీపై అంచనాలను పెంచేసాయి.

అయితే సినిమా విడుదలకు మరొక నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఒక్కొక్క అప్డేట్ ని నెమ్మదిగా విడుదల చేస్తూ వస్తోంది.ఇప్పటికే దేవర నుంచి వచ్చిన రెండు సాంగ్స్ మూవీపైన అంచనాలు అమాంతం పెంచేశాయి.

అనిరుద్ రవిచందర్ ఇచ్చిన మ్యూజిక్ కూడా దేవరకి మెయిన్ అస్సెట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

Telugu Devara, Jr Ntr, Mid Shows, Nrntr, Tollywood-Movie

ఇక దేవర క్యారెక్టర్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్( NTR Performance ) తో అందరిని నెక్స్ట్ లెవల్ కి తీసుకొని వెళ్ళిపోతాడని భావిస్తున్నారు.కొరటాల శివ ఈ సారి సోషల్ మెసేజ్ పక్కన పెట్టి ప్యూర్ గూస్ బాంబ్స్ కథతో దేవర చిత్రాన్ని రెడీ చేస్తున్నారు.తెరపై అరాచకం హై లెవల్ లో ఉంటుందని ఇప్పటికే స్టోరీలైన్ గురించి కొరటాల చూచాయగా చెప్పారు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా రేంజ్ లో దేవర మూవీ రిలీజ్ కాబోతోంది.సెప్టెంబర్ మొదటి వారం నుంచి మూవీ ప్రమోషన్స్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేసే అవకాశం ఉందంట.

ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి కంటెంట్ ని బలంగా జనాల్లోకి పంపించాలని భావిస్తున్నారట. సైఫ్ అలీఖాన్, జాన్వీ కపూర్ ( Saif Ali Khan, Janhvi Kapoor )దేవర చిత్రంలో నటించిన నేపథ్యంలో బాలీవుడ్ లో వారి ద్వారా మూవీకి ఎంతో కొంత ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Telugu Devara, Jr Ntr, Mid Shows, Nrntr, Tollywood-Movie

అలాగే ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కి నార్త్ ఇండియాలో మంచి క్రేజ్ వచ్చింది.అందుకే దేవర మూవీ సౌత్ తో పాటు నార్త్ లో కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడం గ్యారెంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉంటే దేవర మూవీ అరాచకం సెప్టెంబర్ 27న మిడ్ నైట్ షోలతోనే థియేటర్స్ లో మొదలవుతుందని తెలుస్తోంది.త్వరలో చిత్ర యూనిట్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంట.

అర్ధరాత్రి 1:08 గంటలకి దేవర మొదటి షో థియేటర్స్ లో మొదలవుతుందంట.అయితే ఈ విషయాలపై మూవీ మేకర్స్ నుంచి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube