నందమూరి తారక రామారావు పేరు చెపితే తెలియని మనిషి ఉండడు.ఎందుకంటే ఒక సామాన్య మనిషి కూడా హీరో అవ్వచ్చు, మనం ఎవ్వరికి తక్కువ కాదు అని చెప్పి సినిమాల్లోకి వచ్చి మొత్తం తెలుగు ఇండస్ట్రీ లో No.1 హీరో గా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగిన నందమూరి తారక రామారావు గారి ప్రస్థానం గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.అయన తెలుగు తెర మీద చేయని క్యారెక్టర్ లేదు, వేయని వేషం లేదు రాముడు అంటే ఆయనే గుర్తుకువస్తారు, కృష్ణుడు అంటే ఆయనే గుర్తుకువస్తారు.
ఒక అన్న అయినా అతనే గుర్తుకు వస్తారు, ఒక కొడుకు గా కూడా అతనే గుర్తుకు వస్తారు అంటే అతిశయోక్తి కాదు.అలాంటి ఎన్టీఆర్ గారు చూడని స్థాయి లేదు, ఆయన మన తెలుగువాడు అయినందుకు మనం గర్వించాలి.
ఎన్టీఆర్ చేసిన లవకుశ, మాయ బజార్ అడవి రాముడు, దాన వీర శూర కర్ణ అనే మూవీ లో అయితే కర్ణుడు అతనే, దుర్యోధనుడు అతనే కృష్ణుడు అతనే ఇలా ఒక సినిమాలనే ఇన్ని క్యారెక్టర్స్ చేసి మెప్పించారు.ఇప్పుడు ఉన్న హీరో లు ఒక్క హిట్ రాగానే మాకన్న పోటుగాడు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటుంటే అప్పుడు అయన వరసగా ఒక 10 హిట్స్ కొట్టిన అయినా ఎప్పుడు పొంగిపోలేదు అలాగని కొన్ని ప్లాప్స్ వచ్చిన కుంగిపోలేదు.అలాంటి మనిషి తెలుగుదేశం అనే పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం లోకి తెచ్చిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్.ఆయన సీఎం అయి యావత్తు తెలుగు వాడి గౌరవాన్ని పెంచిన వ్యక్తి.2 రూపాయలకు కిలో బియ్యం ఇచ్చిన మొదటి వ్యక్తి.ప్రజలంటే దేవుళ్ళు అనికూడా చెప్తారు అయన.అయితే అయన కి 8 మంది కొడుకులు, 4 కూతుర్లు. వీళ్ళలో కొందరు మనకు తెలుసు హరికృష్ణ , బాలకృష్ణ హీరోలుగా మారిన విషయం సైతం అందరికి తెలిసిందే.
అయితే బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ లాగే చాల పెద్ద హీరో అయ్యాడు.ఇప్పటికి మంచి మంచి సినిమాలు తీసి జనాలని అలరిస్తున్నారు.హిందూపురం ఎమ్మెల్యే గా కూడా తన వంతు సేవ ని జనాలకి చేస్తున్నారు.అలాంటి బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి గారితో ఒక పవర్ ఫుల్ మూవీ కూడా చేస్తున్నారు.
అయితే ఎన్టీఆర్ కూతుర్లలో దగ్గుపాటి పురంధేశ్వరి ఒకరు చంద్రబాబు నాయుడు భార్య అయినా భువనేశ్వరి, మరొక కూతురు లోకేశ్వరి కాగా చిన్న కూతురు ఉమా మహేశ్వరీ.
అయితే అందరి జీవితాలు బాగానే ఉన్న ఉమా మహేశ్వరి జీవితం లో మాత్రం చాల విషాదం నిండింది.తనని నరేంద్ర రాజన్ అనే వ్యక్తి కి ఇచ్చి పెళ్లి చేసాడు ఎన్టీఆర్.అయితే అయన చాలా సాడిస్ట్ గా బిహేవ్ చేసేవాడని, సిగరేట్ తో కాల్చేవాడని ఉమా మహేశ్వరి వాళ్ళ నాన్న అయినా ఎన్టీఆర్ కి చెపితే అతడితో విడాకులు ఇప్పించి ఇంకో వ్యక్తికి ఇచ్చి పెళ్ళిచేసాడు.
ఇక ఎన్టీఆర్ వారసులుగా వచ్చిన వాళ్లలో హరి కృష్ణ కొడుకు అయినా కళ్యాణ్ రామ్ అడపా దడపా సినిమాలు తీసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం తాత కి తగ్గ మనవడు అనిపించుకున్నాడు.ఎన్టీఆర్ ఇప్పుడు RRR షూట్ లో ఉన్న విషయం మన అందరికి తెలిసిందే.
ఇక పెద్ద ఎన్టీఆర్ మనవడు గా తారక రత్న ఎంట్రీ ఇచ్చిన పెద్ద గా ఆకట్టు కోలేక పోయాడు.బాల కృష్ణ కొడుకు మోక్షజ్ఞ కూడా ఇప్పుడు హీరో గా నటించేందుకు సిద్ధం గా ఉన్నాడు.
అయితే బాలకృష్ణ బిడ్డ బ్రహ్మణీ ని చంద్రబాబు నాయుడు కొడుకు అయినా నారా లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసారు.బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ల పేర్లతో రీసెంట్ గా కథనాయకుడు, మహానాయకుడు అనే సినిమాలని కూడా చేసారు.
పెద్ద ఎన్టీఆర్ గారు అయన భార్య చనిపోయాక, NTR జీవితం చివరి స్టేజి లో ఉన్నపుడు ఆయనికి సహాయం చేయడానికి అని లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకున్నాడు.ఎన్టీఆర్ అంటే ఇప్పటికి చాల మంది జనాలు దేవుడు ల కొలుస్తారు.
అంత గొప్ప వ్యక్తి అయన.ఎన్టీఆర్ గురించి చెప్పడానికి మనం మాట్లాడుకునే మాటలు సరిపోవు… అయన తెలుగు ఇండస్ట్రీ లో ఒక శిఖరం లాంటి వారు…
.