జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం రాజన్న సిరిసిల్ల

తేదీ.9.8.2024 జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వసంతరావు రాజన్న సిరిసిల్ల గారు జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ సెంటర్లు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ నిర్వాహకులందరికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తెలియజేయునది వర్షాకాలంలో వచ్చే వ్యాధులు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరములు పరీక్షలు చేసిన వెంటనే ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ కాగానే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి తెలియజేయాలని వెంటనే వారికి తగిన చికిత్స చేయాలని ప్రజలను అనవసరంగా భయభ్రాంతులకు గురి చేయవద్దని తెలిపారు.ఎవరైనా తప్పుడు వ్యాధి నిర్ధారణ చేసినా ప్రైవేట్ ఆస్పత్రులపై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొనబడును.తప్పు స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చిన డయాగ్నస్టిక్ సెంటర్ లపై చర్యలు తీసుకొనబడును.

 District Medical Health Department Office Rajanna Sircilla, District Medical Hea-TeluguStop.com

పిసి పి ఎన్ డి టి యాక్ట్ 1994 ప్రకారము లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్ లపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని నిర్వాహకులను హెచ్చరించడమైనది.గర్భాధారణ మరియు కాన్పులు నిర్వహించే ప్రైవేట్ హాస్పిటల్ పెద్ద ఆపరేషన్లు అంటే సి సెక్షన్100% నిర్వహించే హాస్పిటల్ పై క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చట్టపరంగాశిక్ష, చర్యలు చేపడతామని ప్రైవేట్ ఆస్పత్రిలో నిర్వాహకులు అందరికీ కలెక్టర్ ఆదేశాల మేరకు సూచించనైనది.

దీనితోపాటు అన్ని ఆసుపత్రులలో సరైన వసతులు అనగా త్రాగునీరు, మరుగుదొడ్లు, రోగులు కూర్చునడానికి, సరైన సదుపాయం, పరిసరాల పరిశుభ్రత వంటివి పాటించాలని తెలియజేశారు.అన్ని ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు సురక్షిత త్రాగునీటి వసతి, బాల బాలికలకు వేరువేరుగా పరిశుభ్రమైన మరుగుదొడ్లు నిర్మించి, వాడిన తర్వాత చేతులను కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, జిల్లాలోని ప్రతి పాఠశాలలో ప్రథమ చికిత్స కిట్ (అవసరమైన మందులు) తప్పనిసరిగా ఉంచాలనీ సూచించడం అయినది.

జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రి గా మార్పు చెందడం వలన సిరిసిల్ల, వేములవాడ అసుపత్రులలో సిటీ స్కాన్ అల్ట్రా సౌండ్ స్కాన్, సేవలుప్రసూతి సేవలుఛాతీ ఎముకల వైద్య నిపుణులు, సాధారణ శస్త్ర చికిత్సలు, ,చెవి,చర్మం,వైద్యుల నిపుణులుకంటి, ముక్కు గొంతు, వైద్య నిపుణులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందజేస్తారని తెలియపరచనయినది.

ప్రజలకు ఆరోగ్య పరముగా ఏ విధమైన సందేహాలు ఉన్న 18004253333 గల నంబరుకు కాల్ చేయవలసిందిగా గ్రామాలలో ప్రథమ చికిత్స చేసే వారిని సంప్రదించ వద్దని, నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడి విచారణ కౌంటర్ లో అడిగి తెలుసుకొని అవుట్ పేషెంట్ సేవలను వినియోగించవకోనవలసినదిగా కోరడం అయినదని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube